📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Telugu News: Bathukamma 2025: గిన్నిస్ రికార్డుల దిశగా తెలంగాణ

Author Icon By Pooja
Updated: September 29, 2025 • 3:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రం బతుకమ్మ పండుగను ప్రపంచ స్థాయిలో నిలబెట్టే ప్రయత్నంలో మరో అడుగు ముందుకు వేసింది. ఒకేసారి 10 వేల మంది మహిళలు బతుకమ్మ చుట్టూ తిరిగి పాటలు పాడుతూ పాల్గొనే కార్యక్రమం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించాలనే లక్ష్యంతో ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

ఈ వేడుకలు సరూర్‌నగర్ మున్సిపల్ స్టేడియంలో(Municipal Stadium) సోమవారం సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 66.5 అడుగుల ఎత్తైన ప్రత్యేక బతుకమ్మను సిద్ధం చేశారు. పర్యాటకశాఖ ఎండీ వల్లూరి క్రాంతి, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ పంకజా సహా పలువురు అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Read Also: Bangladesh: బంగ్లాదేశ్ లో హింసాకాండ.. బాలికపై సామూహిక అత్యాచారమే కారణమా

ప్రముఖుల హాజరుతో సందడి

ఈ భారీ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్కతో పాటు పలువురు మహిళా ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ఇప్పటికే పోలీసు శాఖ విశాలమైన బందోబస్తు ఏర్పాటు చేసి, ఎల్బీనగర్–దిల్‌సుఖ్‌నగర్ రూట్లలో ట్రాఫిక్ మళ్లింపులు(Traffic diversions) అమలు చేస్తోంది.

ఇకపోతే, బతుకమ్మ సంబరాల భాగంగా ఎల్‌బీ స్టేడియం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు మహిళల బైక్, సైకిల్ ర్యాలీ కూడా జరిగింది. మంత్రి జూపల్లి కృష్ణారావు జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించగా, ఆయనే సైకిల్‌పై పాల్గొని మహిళలను ప్రోత్సహించారు. హైదరాబాద్‌కు చెందిన మహిళా బైకర్స్ సంప్రదాయ వస్త్రధారణలో బుల్లెట్ బైకులపై పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News in Telugu Google News in Telugu Guinness World Record Bathukamma Hyderabad Bathukamma Celebrations Latest News in Telugu Telangana Bathukamma Telugu News Today Women Bathukamma Event

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.