📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ RS ప్రవీణ్ కుమార్ కు సజ్జనార్ నోటీసులు వాహనాల రిజిస్ట్రేషన్

Latest News: Telangana: పిల్లాడి ఇంటి ముందు టీచర్ల ధర్నా

Author Icon By Saritha
Updated: December 8, 2025 • 3:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బడికి వస్తావా… మమ్మల్ని ఇంటికి రమ్మంటావా? అన్న నినాదంతో భద్రాచలం ఐటీడీఏ (ITDA) పరిధిలోని ఉపాధ్యాయులు(Telangana) డ్రాపౌట్‌లను తగ్గించేందుకు వినూత్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. విద్యార్థులను పాఠశాలకు రప్పించే ప్రయత్నంలో భాగంగా, వారు ఏకంగా ఓ విద్యార్థి ఇంటి ముందు ధర్నాకు దిగారు. విద్యా హక్కును పరిరక్షించడం మరియు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను విద్యార్థులకు చేర్చడం తమ బాధ్యతగా గుర్తించినందునే ఈ మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చిందని ఉపాధ్యాయులు రవి తెలిపారు. భద్రాద్రి జిల్లా, దుమ్ముగూడెం మండలం, నిమ్మలగూడెంలో ఈ ఆసక్తికర సంఘటన జరిగింది. స్థానిక గిరిజన పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న నక్క మనోవరుణ్ అనే విద్యార్థి వారం రోజులుగా పాఠశాలకు రావడం మానేశాడు.

Read also: భోజనం తర్వాత సోంపు ఎందుకు తింటారో తెలుసా..

Teachers protest in front of child’s house

విద్యార్థి ఇంటి ముందు ఉపాధ్యాయుల ఆందోళన

మనోవరుణ్(Telangana) బడికి డుమ్మా కొట్టడంతో, ఉపాధ్యాయులు ముందుగా అతని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యార్థిని బడికి పంపాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఉపాధ్యాయులు ప్రతిరోజూ ఇంటికి వెళ్లినా, మనోవరుణ్ మాత్రం పాఠశాల(School) బాట పట్టలేదు. మనోవరుణ్‌కు చదువుకోవాలనే ఆసక్తి ఉన్నప్పటికీ, కుటుంబ పరిస్థితుల కారణంగా తల్లిదండ్రులు పంపడం లేదని ఉపాధ్యాయులు గుర్తించారు. దీంతో వారు తల్లిదండ్రులను మరింత గట్టిగా ప్రశ్నించారు. చదువుకోవాల్సిన పిల్లలను పనికి పంపిస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని వారికి స్పష్టంగా తెలియజేశారు. అయినప్పటికీ, వారిలో మార్పు కనిపించకపోవడంతో, మాటలతో ప్రయోజనం లేదనుకున్నారు. అందుకే, టీచర్లు మిగతా విద్యార్థులను వెంటబెట్టుకుని మనోవరుణ్ ఇంటి ముందు కూర్చుని ధర్నాకు దిగారు. పిల్లాడి భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు పడుతున్న ఈ అసాధారణమైన శ్రమను చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. వారు కూడా ఉపాధ్యాయులకు అండగా నిలబడ్డారు. దీంతో, మనోవరుణ్ తల్లిదండ్రులు దిగివచ్చి, తమ కుమారుడిని ఖచ్చితంగా బడికి పంపిస్తామని హామీ ఇచ్చారు. వారి హామీతో ఉపాధ్యాయులు తమ ధర్నాను విరమించారు. పిల్లల్ని బడిబాట పట్టించడం కోసం ఐటీడీఏ అధికారులు, ఉపాధ్యాయులు చేస్తున్న ఈ కృషిని స్థానికులు ఎంతగానో అభినందించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Badradri dropout-prevention education-rights ITDA Latest News in Telugu Nimmalagudem school-protest student-attendance Teachers

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.