📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest news: Telangana crime: బాలుడిని హతమార్చిన ఆటోడ్రైవర్

Author Icon By Saritha
Updated: October 28, 2025 • 3:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తన భార్య తనను వదిలి వెళ్లిపోవడానికి ఓ మహిళ కారణమని భావించిన ఓ కిరాతకుడు ఆమె ఐదేళ్ల కుమారుడిని (Telangana crime) హతమార్చాడు. ఎవరో ఏదో చెబితే ఆ మాటల్ని వినేసి, బంధాలను తెంపుకునే వెర్రివెంగళప్పలు ఎవరూ ఉండరు. వివాహం అంటే నూరేళ్ల పంట. జీవితాంతం కలిసి బతికేందుకు పెళ్లి అనే రెండక్షరాల బంధంతో ఒక్కటైన జంట ఏ పక్కింటి పుల్లమ్మనో వెనికింటి ఎల్లమ్మనో చెబితే మొగుణ్ణి వదిలేసి వెళ్లేవారు ఉండరు. అలా భ్రమించి, ఎదుటివారికి తీరని అన్యాయం చేస్తుంటారు. తాజాగా ఓ ఆటోడ్రైవర్ కూడా సరిగ్గా ఇదే చేసి, ఆ తల్లికి కడుపుకోతను మిగిల్చాడు.

గొంతు నులిమి చంపిన కిరాతకుడు అనంతపురంలోని అరుణోదయ కాలనీలో ఉండే గోవిందు హరి, నాగవేణి దంపతుల చిన్న కుమారుడు సుశాంత్ (5)ను కిడ్నాప్ చేశాడు ఆటోడ్రైవర్ పెన్నయ్య. ఇంట్లో ఎవరూ లేనిసమయంలో లోపలికి దూరి బాలుడిని సంచిలో కిడ్నాప్(Kidnap) చేశాడు. అనంతరం గొంతు నులిమి హతమార్చాడు. తర్వాత మృతదేహాన్ని కంపచెట్ల మధ్యలో విసిరేసి, తనకు ఏమీ తెలియదు అన్నట్లుగా ఇంటికి చేరుకున్నాడు పెన్నయ్య.

Read also: మచిలీపట్నానికి దూరం లో 160 km మొంథా– ఏపీ తీరానికి ప్రమాద హెచ్చరిక

Telangana crime: బాలుడిని హతమార్చిన ఆటోడ్రైవర్

బాలుడు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు

కాగా తల్లి నాగవేణి అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లింది. ఇంటికి వచ్చేసరికి సుశాంత్ కనిపించకపోవడంతో, పక్క ఇంట్లో ఉండే నాయనమ్మ దగ్గర పడుకున్నాడని తల్లిదండ్రులు హరి, నాగవేణి భావించారు. అయితే ఉదయం అయినా బాలుడు కనిపించక పోవడంతో కంగారుపడి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు ఆటోడ్రైవర్(Telangana crime) పెన్నయ్యపై అనుమానం ఉందని చెప్పడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో తానే ఈ హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. తన భార్య తనను వదిలేసి వెళ్లిపోవడానికి నాగవేణి కారణమని, అందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పెన్నయ్య చేసిన నేరాన్ని ఒపుకున్నాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

    Anantapur Crime Andhra Pradesh News auto driver murder Child Murder Case Crime News domestic dispute Latest News in Telugu police investigation Telugu News

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.