📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

రెండో రోజు కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Author Icon By sumalatha chinthakayala
Updated: March 13, 2025 • 10:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: నేడు రెండో రోజు బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. బుధవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవా వర్మ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగుతుంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ తీర్మానాన్ని బలపరుస్తారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానం పై చర్చ శనివారం కూడా కొనసాగనుంది.

సభ ముందుకు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ

అదే విధంగా బుధవారం రోజున బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ మంత్రి సభ ముందు తీసుకొచ్చారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క తెలంగాణ వాటర్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ 5, 6, 7 వార్షిక నివేదికల ఖాతాల కాపీని సభలో పెట్టారు. అదేవిధంగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ నోటిఫికేషన్ కాపీని మంత్రి సీతక్క సభ ముందు పెట్టారు.

19న అసెంబ్లీలో బడ్జెట్‌

కాగా, ఈనెల 27వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. హోలీ సందర్భంగా శుక్రవారం సభకు సెలవు ప్రకటించారు. ఈనెల 19న అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. ఈనెల 17, 18 తేదీల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు ఎస్సీ వర్గీకరణ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశముంది. 21వ తేదీ నుంచి బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుండగా.. ఈనెల 27 వరకు పలు పద్దులపై చర్చ కొనసాగుతాయి. అదేరోజు సభ వాయిదా పడే అవకాశం కూడా ఉంది. మొత్తంగా 12 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి.

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu second day telangana assembly sessions Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.