📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: TDP: గీత దాటితే వేటు తథ్యం

Author Icon By Saritha
Updated: November 1, 2025 • 12:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సీఎం చంద్రబాబు హెచ్చరిక

విజయవాడ : పార్టీ(TDP) ప్రజాప్రతినిధులపైనే టీడీపీ కార్యకర్తలు వర్గాలుగా విడివిడిపోయి ఆరోపణలు చేస్తూ రోడ్డుకు ఎక్కడవంటి చర్యలను ఎంత మాత్రం సహించేది లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ నేత, ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) హెచ్చరించారు. ఈ వర్గాలను ప్రజాప్రతినిధులు ప్రోత్సహించడనాన్ని ఉపేక్షించేది లేదన్నారు. టీడీపీ నేతలకి సంబంధించిన తిరువూరు విభేదాల పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ లైన్ ఎవరూ దాటినా సహించేది లేదని హెచ్చరించారు. టీడీపీ తిరువూరు విభేదాలకి కారణమైన ఇరువురు నేతలు ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపుడి శ్రీనివాసరావులతో తాను కూడా మాట్లాడుతానని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. ఆ తర్వాత కూడా పరిస్థితి చక్కబడకపోతే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ ఈ విషయాన్ని ఇరువురు నేతలకి చెప్పాలని సూచించారు. శుక్రవారం టీడీపీ నేతలతో చంద్ర బాబు సమావేశం అయ్యారు.

Read also: హైదరాబాద్ లో ఆగని డిజిటల్ అరెస్టు మోసాలు

TDP: గీత దాటితే వేటు తథ్యం

తిరువూరు విభేదాలపై ఎంపీ కేశినేని చిన్ని

ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన పలు కీలక అంశాలపై అధినేత చర్చించారు. అనంతరం పార్టీ(TDP)నేతలతో తిరువూరు విభేదాల గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో తిరువూరు వివాదాన్ని పార్టీ క్రమ శిక్షణ కమిటీకి అప్పగించారు, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపుడి శ్రీనివాసరావులని పిలిపించి మాట్లాడాలని ఆదేశాలు జారీ చేశారు. ఇరువురు అభిప్రాయాలను ఓ లేఖ రూపంలో తనకు ఇవ్వాలని ఆదేశించారు. తాను లండన్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఇరువురిని పిలిపించి మాట్లాడుతానని అధినేత స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైసీపీ నెగెటివ్, ఫేక్ ప్రచారం చేస్తోందని చంద్రబాబు దృష్టికి పార్టీ నేతలు తీసుకువచ్చారు. ఈ విషయంపై నిజాలు ఏమిటో ప్రజలకు టీడీపీ శ్రేణులు వివరించాలని చెప్పారు. అవసరమైతే సోషల్ మీడియాలో ఈ విషయంలో అవగాహన ఉన్నవారిని తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. అయితే, వచ్చే వారం తర్వాత నుంచి వారంలో ఒకరోజు మొత్తం టీడీపీ కేంద్ర కార్యా లయంలోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు సీఎంఆర్ఎఫ్ లేఖలు ఇవ్వడం లేదని సీఎంకు పార్టీ కేంద్ర కార్యాలయం సిబ్బంది చెప్పారు. ఆ ఎమ్మెల్యేలు ఎవరో తనకు వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు సీఎం. అంత సమయం లేకుండా ఎమ్మెల్యేలు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. ఆ ఎమ్మెల్యేల జాబితా తయారు చేసి తనకు టెలికా న్ఫరెన్స్ అందరిని కలపాలని ఆజ్ఞాపించారు. తన లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే టీడీపీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీలను నియమిస్తామని చెప్పుకొచ్చారు. జాబితాలు సిద్ధంగా ఉన్నాయని, వాటిని తీసుకొని రావాలని టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివా సరావుకు ఆదేశాలు జారీ చేశారు.

పార్టీ కేడర్ ఎంపవర్మెంట్‌పై పూర్తి స్థాయి చర్చ చంద్రబాబు దృష్టి

ఈ విషయంపై తాను ఒక గంట సమయం కేటాయిస్తే చాలని చెప్పుకొచ్చారు. మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాలకు ఎమ్మెల్యేలు నవంబరు 2వ తేదీన మళ్లీ వెళ్లాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. పంటల నష్టం అంచనా సరిగా జరిగిందా లేదా? అనే అంశంపై టీడీపీ నేతలు అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పార్టీ కేడర్, ఎమ్మెల్యేలు క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉంది. పార్టీ కేడర్కు క్షేత్రస్థాయిలో వాస్త వాలు బాగా తెలుస్తాయి. పార్టీ సిద్ధాంతాలుపై అవగాహనలేని వారికి టిక్కెట్లు ఇవ్వడం పొర పాటు. ప్రస్తుతం జరుగుతున్న గొడవలకు ఇదే ప్రధాన కారణమేమోనని అనిపిస్తుంది. వ్యక్తిగత ఇమేజ్ కోసం అందరూ కొందరు పాకులాడుతున్నారు. వ్యక్తిగత ఇమేజ్ కోసం ప్రయత్నం చేస్తే వాళ్లు వెళ్లి వ్యక్తిగతంగా పోటీ చేస్తే బాగుంటుంది. ఎవరూ రిలీజియస్ సెంటిమెంట్లను టచ్ చేయొద్దు. ఒక ఎమ్మెల్యేగా ఒక మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. పార్టీ కేడర్ ఎంపవర్మెంట్పై పూర్తి స్థాయి చర్చ ఉంది. వాళ్లకు ఎటువంటి శిక్షణ ఇవ్వాలనే అంశంపై చర్చించాం.

రాజకీయం డబ్బులు సంపాదించడం కోసం అనే భావన నుంచి నేతలు బయటకు రావాలి అని సూచిం చారు. సంపాదనకు వేరే మార్గాలు చూసుకోవాలి. కొంతమంది లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు. ఆ వ్యాపారం ద్వారా వచ్చే డబ్బు ఎప్పుడూ నిలబడదు. ఎన్నికల ముందు రూ.4వేల పెన్షన్ ఇస్తామని చెప్పాను. అందుకనే నేను పార్టీ వాళ్లను సచివాలయ సిబ్బందితో వెళ్లి పక్కన నుంచొని ఉండమని చెప్పాను. పార్టీ ఓనర్ షిప్ తీసుకోవాలి. పార్టీ ఇక ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండదు. ఎప్పుడు అధికారంలో ఉంటుంది అని ధీమా వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh politics Chandrababu Naidu Kesineni Chinni Kolikapudi Srinivasa Rao Latest News in Telugu TDP Telugu News Tiruvuru Dispute

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.