📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu news : Tax notice – చిన్న స్వీట్‌ షాప్‌కు రూ.141 కోట్ల ట్యాక్స్‌ నోటీస్‌..

Author Icon By Sudha
Updated: September 1, 2025 • 5:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చిన్న స్వీట్‌ షాప్‌ (Sweet shop) నిర్వహిస్తున్న ఓ చిరువ్యాపారికి ఏకంగా రూ.141 కోట్ల పన్ను నోటీస్‌ (Tax Notice) జారీ అయ్యింది. దాంతో ఆ షాప్‌ ఓనర్‌ షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటన ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. యూపీలోని బులంద్‌షహర్‌ ప్రాంతంలో ఓ చిన్న స్వీట్‌ దుకాణం నడుపుతున్న సుధీర్ అనే వ్యక్తికి రూ.141 కోట్లకు పైగా అమ్మకాలపై ఆదాయపు పన్ను విభాగం అధికారుల నుంచి వచ్చిన నోటీసు (Tax Notice) చూసి కంగుతిన్నాడు. వెంటనే పోలీస్‌స్టేషన్‌కు పరుగులు తీసి ఫిర్యాదు చేశాడు. తనకు సంబంధంలేని కంపెనీ అమ్మకాలపై 2022లో కూడా సీజీఎస్టీ కార్యాలయం నుంచి పన్ను నోటీస్‌ (Tax Notice) అందిందని, ఆ కంపెనీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని అప్పుడే పన్ను విభాగ అధికారులకు వివరించానని తెలిపాడు. మళ్లీ జూలై 10న తాను రూ.141 కోట్ల అమ్మకాలు చేసినట్లు మరో నోటీస్‌ వచ్చిందన్నాడు. ఆ నోటీస్‌లో తన పేరు, చిరునామా, పాన్‌ నంబర్‌ ఉండటమే కాకుండా.. తాను ఢిల్లీలో ఆరు కంపెనీలను నడుపుతున్నట్లు ఉందని చెప్పాడు.

Tax notice – చిన్న స్వీట్‌ షాప్‌కు రూ.141 కోట్ల ట్యాక్స్‌ నోటీస్‌..

అయితే దీనిపై బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కొందరు ఆర్థిక, సైబర్‌ నేరగాళ్లు బ్యాంకు ఖాతాలు తెరవడానికి, షెల్ కంపెనీలను సృష్టించడానికి, రుణాలు పొందడానికి లేదా పన్నులు ఎగవేసేందుకు ఎవరైనా మరొక వ్యక్తి పాన్ వివరాలను చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తుంటారని అధికారులు వెల్లడించారు. ఇటువంటి మోసాలు పన్ను నోటీసులు వచ్చినప్పుడో లేదంటే రికవరీ కాల్స్‌ వచ్చినప్పుడో బయటపడుతుందని చెప్పారు. కాబట్టి ప్రజలు తమ పాన్‌కార్డు వివరాలను బయటి వ్యక్తులతో పంచుకోవద్దని, తమ క్రెడిట్ నివేదికలను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకుంటూ ఉండాలని సూచించారు. పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్‌ చేయడం వల్ల ఇలాంటి మోసాలను చాలావరకు అరికట్టవచ్చని సూచించారు. ఇదిలావుంటే ఇటీవల ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికుడికి కూడా రూ.34 కోట్ల అమ్మకాలపై పన్ను చెల్లించాలని నోటీసులు అందాయి. దాంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఆదాయపు పన్ను నోటీసును విస్మరించవచ్చా?

ఆదాయపు పన్ను శాఖ పంపిన పన్ను నోటీసును నేను విస్మరిస్తే ఏమి జరుగుతుంది? మీరు జరిమానాలు, జరిమానాలు మొదలైన వాటి రూపంలో తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది . పన్ను నోటీసును విస్మరించవద్దని సూచించబడింది. 

భారతదేశంలో ఎవరు 0 పన్ను చెల్లిస్తారు?

సంవత్సరానికి 10 లక్షల ఆదాయం (భారతదేశ తలసరి ఆదాయం దాదాపు 2 లక్షలు) మరియు కొత్త పన్ను విధానం ప్రకారం 7 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

ఆదాయపు పన్ను శాఖకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించవచ్చా?

హైకోర్టుకు అప్పీల్ [సెక్షన్ 260A]

ట్రిబ్యునల్ ఉత్తర్వును అసెస్సీ లేదా ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్/ప్రిన్సిపల్ కమిషనర్/చీఫ్ కమిషనర్ లేదా కమిషనర్ అందుకున్న తేదీ నుండి 120 రోజులలోపు. జాప్యానికి తగిన కారణం ఉందని హైకోర్టు సంతృప్తి చెందితే 120 రోజుల తర్వాత అప్పీలును స్వీకరించవచ్చు .

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/telugu-news-if-we-lose-our-visa-and-job-we-will-go-to-india-opinion-of-indians-in-the-us/international/539521/

Breaking News financial news Income Tax India News latest news Small Business Sweet Shop

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.