📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

మావోయిస్టు కీలక నేత లొంగుబాటు..!

Author Icon By sumalatha chinthakayala
Updated: February 21, 2025 • 5:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

లొంగుబాటుకు సంబంధించిన వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్

హైదరాబాద్‌: కేంద్ర రాష్ట్ర నిర్భందాలు పెరిగిన ఎన్ కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. వరుస ఎన్ కౌంటర్లతో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో చనిపోతుండగా.. మరికొందరూ లొంగుబాటు పడుతున్నారు. తాజాగా మావోయిస్టు పార్టీ గొత్తికోయ ఏరియా కమిటీ సభ్యురాలు కొసా ప్రొటెక్షన్ గ్రూపు కమాండర్ వంజెం కేషా అలియాస్ జిన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట లొంగిపోయారు. లొంగుబాటుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు.

కొసా ప్రోటెక్షన్‌ గ్రూప్‌ మహిళా కమాండర్‌ బాధ్యతలు

ఛతీస్ గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పామెడ్ మండలం, రాసపల్లి గ్రామానికి చెందిన వంజెం కేషా బాల్యం నుంచే చైతన్య నాట్య మండలిలో పని చేయడంతో మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యులతో పరిచయాలు కావడంతో 2017లో పామెడ్ లోక్ స్క్వాడ్ కమాండర్ గొట్టే కమల ద్వారా మావోయిస్టు పార్టీలో చేరారు. రెండేళ్ల పాటు పున్నెం జోగ ఆధ్వర్యంలో చైతన్య నాట్యమండలిలో పని చేసింది. ఇదే సంవత్సరం కేషాను పార్టీ నాయకత్వం అబుజ్ మడ్ ప్రాంతానికి బదిలీ చేసి కేంద్ర కమిటీ సభ్యుడు కడారీ సత్యనారాయణ రెడ్డికి ప్రోటెక్షన్ గ్రూపు సభ్యురాలుగా నియమించింది. 2024 ఎప్రిల్‌ మాసంలో తిరిగి కంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారయన రెడ్డి ఆలియాస్‌ కొసా ప్రోటెక్షన్‌ గ్రూప్‌ మహిళా కమాండర్‌ బాధ్యతలు చేపట్టింది

కేషాపై 4 లక్షల రూపాయల ప్రభుత్వ రివార్డు

కేషా తండ్రి హిడ్మా కూడా మావోయిస్టులలో పనిచేశాడు. ప్రస్తుతం అతను జైలులో ఉన్నాడు. పోలీసుల ఎదుట లొంగిపోయిన వంజెం కేషాపై 4 లక్షల రూపాయల ప్రభుత్వ రివార్డు వున్నట్లుగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ వెల్లడించారు. పార్టీలో పనిచేసిన సమయంలో కేషా కొహిలబేడా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మావోయిస్టు పార్టీ సభ్యులతో పోలీసుల బలగాలపై కాల్పులు జరపడంతో ఒక పోలీస్‌ అధికారి మరణించగా మరో పోలీస్‌ అధికారి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటనతో పాటు అబుజ్‌మడ్‌ ప్రాంతంలో పోలీసులపై జరిపిన కాల్పుల్లో ఒక పోలీస్‌ అధికారి మరణించాడు. ఈ రెండు సంఘటనల్లో వంజెం కేషా నిందితురాలుగా ఉన్నారని పోలీస్ కమిషనర్ తెలిపారు.

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Maoist leader Surrender Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.