తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ (suparipalana lo tholi adugu ) అనే ప్రజా చైతన్య కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వ లక్ష్యాలను, ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సామర్థ్యవంతమైన పాలన విధానాలను ఇంటింటికి వెళ్లి వివరిస్తున్నారు. ఈ కార్యక్రమం టీడీపీ మండల కన్వీనర్ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
పూజలతో ప్రారంభం – ఇంటింటి ప్రచారానికి శ్రీకారం
ఈ కార్యక్రమానికి బాలకృష్ణ పీఏ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేతలు మొదట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అధికారికంగా ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు కూటమి ప్రభుత్వం చేస్తున్న సేవలు, సుపరిపాలన లక్ష్యాలు తెలియజేశారు. ప్రజల సమస్యలు, అభిప్రాయాలను నేరుగా తెలుసుకుంటూ, వారికి జవాబుదారీ పాలనను హామీ ఇస్తున్నారు.
ప్రజలతో మమేకం
ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ బేకరీ గంగాధర్, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ ఆనంద్ కుమార్, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ అశ్వర్థ రెడ్డి, శ్రీదేవి, అంజనమ్మ, లక్ష్మీదేవి తదితర స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలతో మమేకమవుతూ వారికి టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ఫలితాలు ఎలా వస్తున్నాయో వివరించారు. ప్రజల విశ్వాసాన్ని పొందే దిశగా ఈ ప్రచారం ముందుకు సాగుతుండగా, పార్టీ శ్రేణులు కూడా స్ఫూర్తితో చొరవ చూపిస్తున్నాయి.
Read Also : Alluri Jayanthi 2025 : అల్లూరి జయంతి వేడుకల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్