हिन्दी | Epaper
అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన

ఎండాకాలం మొదలైందోచ్

Sudheer
ఎండాకాలం మొదలైందోచ్

తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గి, ఎండలు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. కొన్నిరోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండటంతో ప్రజలు వేడికి తట్టుకోలేకపోతున్నారు. వాతావరణ మార్పుల కారణంగా ఎండాకాలం ప్రభావం ముందుగానే కనిపిస్తోంది.

ఎండలు పెరిగేకొద్దీ ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం పెరుగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్ర విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరింది. మంగళవారం రోజున 15,582 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైందని అధికారులు వెల్లడించారు. గతేడాది ఇదే రోజున 13,276 మెగావాట్ల వినియోగం మాత్రమే ఉండటం గమనార్హం.

summer season start

ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, మరికొన్ని రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పొదుపు చర్యలు పాటించకుంటే విద్యుత్ వినియోగంలో మరింత పెరుగుదల ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.

ఎండ ప్రభావంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బయటకు వెళ్లేటప్పుడు తలపాగా ధరించడం, శరీరంలో తేమను నిల్వ ఉంచేందుకు నీటిని తగినంతగా తాగడం వంటివి పాటించాలి. తీవ్రమైన ఎండల వల్ల డీహైడ్రేషన్, సన్‌స్ట్రోక్‌లకు గురికాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

వచ్చే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశమున్నందున, ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి. నీటి వనరుల పరిరక్షణ, ప్రజలకు తాగునీరు అందించే ఏర్పాట్లు చేయడం, విద్యుత్ సరఫరాలో అంతరాయంలేకుండా చూడడం వంటి చర్యలు అవసరం. ఎండాకాల ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870