📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు?

స్టార్‍ హాస్పిటల్స్లో పక్షవాత చికిత్సా కేంద్రం ప్రారంభం

Author Icon By sumalatha chinthakayala
Updated: January 8, 2025 • 10:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‍: జనవరి హైదరాబాద్‍ బంజారాహిల్స్, రోడ్‍ నెం. 10లోని స్టార్‍ హాస్పిటల్స్లో నేడే వారి నూతన ‘స్టార్‍ కాంప్రెహెన్సివ్‍ స్ట్రోక్‍ కేర్‍ సెంటర్‍’కు శుభావిష్కరణను నిర్వహించారు. దీనితో, జంటనగరాలు, తదితర సమీప ప్రాంతాలవారికీ, ఉభయ రాష్ట్ర ప్రజలకూ, పక్షవాతరోగ నిదాన, చికిత్స విధివిధానాలలో గొప్ప ఉపశమన కేంద్రం అందుబాటులోకి వచ్చినట్లయింది.

పక్షవాత కారణంగా మనదేశంలో లక్షలాదిమంది సమయానికి తగిన వైద్యసదుపాయాలు లభ్యంకాక, అనేక శారీరక, కుటుంబపరమైన ఇబ్బందులను ఎదుర్కోవటమే కాక, అకాల మరణాలకూ గురి అవుతున్నారు. ఈ విషయంలో రోగులకు, వారి కుటుంబీకులకు తగిన చికిత్సనూ, మానసిక స్థైర్యాన్నీ అందించవలసిన ఆవశ్యకతను గుర్తించి, స్టార్‍ హాస్పిటల్సపక్షవాత రోగ నిర్ధారణ, సత్వరంగా వేగవంతమైన చికిత్స, రోగులకు సంపూర్ణ స్వస్థత చేకూర్చగల విధంగా సకల అత్యాధునిక సదుపాయాలతో, అనుభవజ్ఞులైన వైద్యబృందంతో ‘స్టార్‍ కాంప్రెహెన్సివ్‍ స్ట్రోక్‍ కేర్‍ సెంటర్‍’కు రూపకల్పన చేసి, ఈనాటినుంచి అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా ‘స్టార్‍ కాంప్రెహెన్సివ్‍ స్ట్రోక్‍ కేర్‍ సెంటర్‍’కు చెందిన న్యూరాలజిస్టులు, న్యూరోసర్జన్‍లు, ఇంటర్‍వెన్షనల్‍ కార్డియాలజిస్టులు, ఎమర్జెన్సీ ఫిజీషియన్‍లు తమ కేంద్రంలో లభిస్తున్న వైద్య సహాయం, విధివిధానాలు, తమ సూచనలతో కలిపి వివరించారు. స్టార్‍ హాస్పిటల్స్ వైద్యనిపుణుల చికిత్సతో, పర్యవేక్షణలో పక్షవాత వ్యాధినుంచి సంపూర్ణంగా కోలుకుని, తిరిగి సాధారణ జీవనం గడుపుతున్న కొందరు వ్యాధిబాధితులు తమ ‘స్టార్‍ హాస్పిటల్స్’ అనుభవాలను, రోగులు సత్వరంగా వైద్యసహాయం పొందవలసిన తీరుతెన్నులగురించీ తెలియజేశారు.

image

‘స్టార్‍ కాంప్రెహెన్సివ్‍ స్ట్రోక్‍ కేర్‍ సెంటర్‍’ ద్వారా తాము – అనేక విధాలుగా పక్షవాత వ్యాధిగ్రస్తులకు తోడ్పడే ప్రయత్నాలను చేపట్టామని స్టార్‍ వైద్యనిపుణులు వివరించారు. ఈ విధివిధానాలలో – పక్షవాతంగురించి అవగాహన ఏర్పరుచుకోవటం, తగిన జాగ్రత్తలు తీసుకోవటం; సత్వర వైద్యపరీక్షలు చేయించుకోవటం; పక్షవాతం అన్న అనుమానం కలిగితే, మొదటి సువర్ణక్షణాలైన నాలుగు గంటలలోపు వైద్యసహాయం పొందటం; తర్వాత రోగచికిత్సకు చర్యలు తీసుకోవటం; అవసరమైన పక్షంలో శస్త్రచికిత్సలు చేయించుకోవటం వంటి వివిధ స్థాయులలో ‘స్టార్‍ కాంప్రెహెన్సివ్‍ స్ట్రోక్‍ కేర్‍ సెంటర్‍’ ఏవిధంగా సహాయపడగలదో వైద్యులు వివరించారు. ఈ కోణంలో సమాజ సమగ్ర ఆరోగ్య పరిరక్షణ దృష్టితో స్టార్‍ హాస్పిటల్సప్రత్యేక ప్యాకేజీలనూ ప్రకటించారు. ఆ వివరాలను స్ట్రోక్‍ ఎమర్జెన్సీ హెల్ప్లైన్‍ 9071 104 108 ద్వారా పొందవచ్చు. 16 సంవత్సరాల నిరంతర ఆరోగ్య, వైద్య రంగాలలో తమ ప్రత్యేకతతో ప్రథమస్థానం పొందుతున్న ‘స్టార్‍ హాస్పిటల్స్’ వారి ఆరోగ్యసేవలో ‘స్టార్‍ కాంప్రెహెన్సివ్‍ స్ట్రోక్‍ కేర్‍ సెంటర్‍’ ఆవిష్కరణ మరో మైలురాయి అన్నది వాస్తవం.

Banjara Hills hyderabad Paralysis Treatment Star Hospitals

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.