📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Stampede: ముందుచూపు లేని అధికారులు

Author Icon By Pooja
Updated: September 29, 2025 • 12:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మనసమాజంలో తొక్కిసలాట ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. వేలల్లో వస్తారని అంచనా వేస్తే లక్షల్లో ప్రజలు రావడం, ఊహించని జనం ఒక్కసారిగా ఒకేచోట చేరుకోవడంతో అనుకోని ఉపద్రవాలు జరుగుతున్నాయి. ఫలితంగా వందల్లో, పదుల్లో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కుంభమేలలో తొక్కిసలాటలో వందలమంది మరణించారు. ఆమధ్య బెంగళూరులో ఐపిఎల్ మ్యాచ్ ఫైనల్స్ లో ఆర్ సిపి నెగ్గినందుకు భారీ ఎత్తున విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు.

Read also: TG Elections: నేటి నుంచే ఎలక్షన్ కోడ్ అమలు

ఈ సభకు ఊహించిన దానికంటే అధికంగా అభిమానులు రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటన 11మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. తాజాగా తమిళనాడులోని కరూర్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య 41కి చేరింది. టీవీకే పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన ఈ ర్యాలీకి భారీ సంఖ్యలో జనం హాజరుకావడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం సింగిల్ జడ్జి విచారణకు ఆదేశించింది.

విజయ్ సభలో ఎవరిది తప్పు?

సినీనటుడు విజయ్ ఇటీవలే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన తన పార్టీకి టీవీకే పార్టీగా గుర్తింపు లభించింది. తమిళనాడులో వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ అధినేత విజయ్ గత శనివారం భారీ ర్యాలీని(huge rally) నిర్వహించారు. ఈ ర్యాలీకి ఊహించని విధంగా ప్రజలు హాజరయ్యారు. దీంతో తొక్కిసలాట జరిగింది. క్షణాల్లో పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రభుత్వం నష్టం జరిగిన తర్వాత సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించింది. అసలు ఒక పార్టీ ర్యాలీకి ప్రభుత్వం కాని, పోలీసులు కానీ అనుమతి ఇస్తున్నప్పుడు అందుకు పరిమిత సంఖ్యలో ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. ఎంత జనం వస్తే తమ విజయానికి అంత చిహ్నంగా భావిస్తూ, ఇటీవల రాజకీయ నాయకులు జనాలను గొర్రెల్లా తోలుతున్నారే తప్ప వారి భద్రతలపై ఏమాత్రం శ్రద్ధ కానీ, చర్యలు కానీ తీసుకోవడం లేదు. ఈ దుర్ఘటనపై ఎవరిది తప్పు అని అనాలి? విజయా? లేక ప్రభుత్వానిదా? ఎవరిని నిందించాలి?

ఆర్ సిపిలో కూడా ఇదే నిర్లక్ష్యం

బెంగళూరు ఆర్ సిపి విజయోత్సవ సభలో(victory ceremony) ఊహించని విధంగా అభిమానులు వచ్చారు. ఫ్రీ టిక్కెట్లు ఇస్తున్నారనే వదంతితో ఒక్కసారిగా ప్రజలంతా ఒకేచోటకు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. స్పాట్లోనే 11మంది మరణించారు. నష్టపోయిన కుటుంబాలకు ఆర్ సిపి జట్లు, ప్రభుత్వం పరిహారం చెల్లించింది. అయినా ఆ లోటును తీర్చగలరా?

తిరుమల తొక్కిసలాటలో ఆరుగురు, ఉత్తరప్రదేశ్ బాబా సభలో 116మంది మృతి

తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణిస్తే, దాదాపు పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన కూడా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మరణించిన కుటుంబాలకు టిటిడి నష్టపరిహారం అందించినా, గాయపడ్డవారికి మెరుగైన చికిత్సలు అందించినా చనిపోయిన తమ ఆత్మీయులను తిరిగి పొందలేరుగా. కుంభమేళలో కూడా జరిగిన తొక్కిసలాటలో వందలో మరణించారు. ఉత్తరప్రదేశ్ లో గతసంవత్సరం జులై 2వ తేదీన హత్రాస్లో ఓ బాబా ఇచ్చే బూడిద కోసం జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 116 మంది మరణించారు. నారాయణ సకార్ హరి బాబా నిర్వహించిన సభకు అధికారులు 80వేల మందికి అనుమతి ఇస్తే, ఏకంగా రెండు లక్షలమందికి పైగానే భక్తులు వచ్చారు. బాబా ఇచ్చే బూడిద కోసం భక్తులు ఎగబడడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇలా నిత్యం దేశంలో ఎక్కడో ఒక్కచోట తొక్కిసలాటలు జరుగుతూనే మాత్రం తమ తీరును మార్చుకోవడం లేదు. దీంతో అమాయకులు బలి అవుతున్నారు. ఉన్నాయి. 

ఈ ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి?
పెద్ద సభల్లో, ర్యాలీలలో మరియు ఉత్సవాల్లో ఊహించని సంఖ్యలో ప్రజలు ఒకేచోట చేరుకోవడం వల్ల, భద్రతా నిబంధనల పాటించకపోవడం వలన తొక్కిసలాటలు చోటు చేసుకుంటున్నాయి.

ఇటీవల జరిగిన ప్రధాన తొక్కిసలాట ఘటనలు ఏవీ?

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News in Telugu Crowd Management india Karur public gathering Stampede Tamil Nadu Telugu News Today Vijay Rally

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.