📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Sports Visas : ట్రాన్స్‌ జెండర్‌ మహిళలకు స్పోర్ట్స్‌ వీసాలపై పరిమితులు..ట్రంప్‌ నిర్ణయం

Author Icon By Sudha
Updated: August 5, 2025 • 3:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వివాదాస్పద నిర్ణయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్. అమెరికా ఫస్ట్‌ అంటూ విదేశీ విద్యార్థులపై ఆంక్షలు, అక్రమ వలసదారులకు బేడీలు వేసి బలవంతంగా వారి స్వదేశాలకు పంపించడం, ప్రపంచ దేశాలపై ఎడాపెడా ప్రతీకార సుంకాలు, గ్రీన్‌ కార్డులు, వీసాలపై కోతలు విధిస్తూ తనదైన శైలిలో పాలనను కొనసాగిస్తున్నారు.తాజాగా ట్రాన్స్‌ జెండర్‌ మహిళలకు (Transgender Women) స్పోర్ట్స్‌ వీసాలపై (Sports Visas) పరిమితులు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మహిళల క్రీడల్లో పోటీ పడాలనుకునే లింగమార్పిడి మహిళలకు వీసా (Sports Visas)అర్హతను పరిమితం చేస్తున్నట్లు ట్రంప్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు అమెరికన్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ పాలసీని సవరించింది. దీని ప్రకారం పురుషుడిగా జన్మించి లింగమార్పిడి చేసుకుని మహిళల క్రీడల్లో పోటీ పడే క్రీడాకారుల దరఖాస్తులను (Sports Visas)ప్రతికూలంగా పరిగణించనుంది.

Sports Visas : ట్రాన్స్‌ జెండర్‌ మహిళలకు స్పోర్ట్స్‌ వీసాలపై పరిమితులు..ట్రంప్‌ నిర్ణయం

అదేవిధంగా ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారికి ఇచ్చే ఓ-1ఏ (O-1A) వీసాలు, అత్యుత్తమ ప్రతిభ కలిగిన వలసదారులకు ఇచ్చే ఈబీ-1, ఈబీ-2 గ్రీన్ కార్డులు, అలాగే నేషనల్ ఇంటరెస్ట్ వేవర్స్ వంటివి ఇకపై ట్రాన్స్‌జెండర్ మహిళలకు సులభంగా మంజూరు కాబోవని యూఎస్‌సీఐఎస్‌ వెల్లడించింది. బయాలజికల్ గుణల వల్ల పురుషులు మహిళల క్రీడలలో గెలిచే అవకాశాన్ని ట్రాన్స్‌జెండర్ ముసుగులో వాడుకుంటున్నారని చాలా కేసుల్లో స్పష్టమైందని ఆ సంస్థ అధికార ప్రతినిధి మాథ్యూ ట్రాగెసర్ వెల్లడించారు. మహిళా క్రీడాకారుల భద్రత, సమానత్వం, గౌరవం, నిజం అనే ప్రమాణాలను రక్షించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్లు పాల్గొనడాన్ని నిషేధించే కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ట్రంప్ సంతకం చేశారు. మహిళల క్రీడలపై జరుగుతున్న యుద్ధం ఈ ఆదేశాలతో ముగుస్తుందని ఆయన పేర్కొన్నారు. మహిళా అథ్లెట్ల సంప్రదాయాన్ని మేం రక్షిస్తాం. వారి క్రీడల్లోకి పురుషులు ప్రవేశించి, వారిని కొట్టడాన్ని అడ్డుకుంటాం. ఇక నుంచి స్త్రీల క్రీడలు స్త్రీలకు మాత్రమే అని స్పష్టం చేశారు. అయితే ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయానికి సెనెట్‌లో చెక్కెదురైంది. మార్చి 5న సెనెట్‌లో జరిగిన ఓటింగ్‌లో వ్యతిరేకంగా 45 ఓట్లు రావాల్సి ఉంది. బిల్లుకు మద్దతుగా 60 ఓట్లు రావాల్సి ఉండగా 51 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ నేపథ్యంలో యూఎస్‌సీఐఎస్‌లో ట్రంప్‌ ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది.

అథ్లెట్లకు ఏ వీసా ఉత్తమమైనది?

అమెరికాకు రావాలనుకునే విదేశీ అథ్లెట్లకు బి, ఓ మరియు పి వీసాలు సాధారణంగా అత్యంత సముచితమైన వీసాలు. చాలా మంది అథ్లెట్లు యునైటెడ్ స్టేట్స్‌ను సందర్శించడానికి వచ్చి వారి సేవలకు డబ్బు పొందరు, సాధారణంగా బి విజిటర్ వీసాపై వస్తారు.

టీమ్ వీసా అథ్లెట్ అంటే ఏమిటి?

ఈ వీసాలు సాధారణంగా ఒక నిర్దిష్ట క్రీడా కార్యక్రమం, పోటీ లేదా శిక్షణా కార్యక్రమం యొక్క వ్యవధికి మంజూరు చేయబడతాయి . అవి అథ్లెట్లు మరియు కోచ్‌లు వారి సంబంధిత క్రీడలకు సంబంధించిన కార్యకలాపాలలో పాల్గొనడానికి పరిమిత కాలానికి ఒక దేశంలోకి ప్రవేశించడానికి అనుమతిస్తాయి.

P1 వీసా గ్రీన్ కార్డ్ పొందవచ్చు?

P1 వీసా అనేది వలసేతర వీసా, అంటే ఇది తాత్కాలిక బస కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు యునైటెడ్ స్టేట్స్‌లో గ్రీన్ కార్డ్ లేదా శాశ్వత నివాసానికి నేరుగా దారితీయదు. P1 వీసా హోల్డర్ తమ రంగంలో అసాధారణ సామర్థ్యాన్ని ప్రదర్శించగలిగితే, వారు EB-1 గ్రీన్ కార్డ్‌కు అర్హత పొందవచ్చు.

Breaking News Donald Trump latest news sports policy Sports Visas Telugu News Transgender Women Visa Restrictions

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.