శబరిమలకు అయ్యప్పస్వామి దర్శనాల సీజన్ ప్రారంభం కావడంతో భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. కాకినాడ టౌన్–కొట్టాయం, కొట్టాయం–కాకినాడ టౌన్, నాందేడ్–కొల్లామ్, కొల్లామ్–నాందేడ్, చర్లపల్లి–కొల్లామ్, కొల్లామ్–చర్లపల్లి మార్గాల్లో మొత్తం 54 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్లే భక్తులకు పెద్ద ఉపశమనం లభించనుంది.
Latest News: NFU: అణు విధానంపై భారత్ స్పష్టమైన సందేశం
రైల్వే అధికారులు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, రైళ్లు ముఖ్యమైన జంక్షన్ల వద్ద ఆగి భక్తులకు అనుకూలమైన టైమింగ్స్‌లో నడవనున్నాయి. ప్రత్యేక రైళ్లలో స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ బోగీలను ఏర్పాటు చేయనున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో అదనపు కోచ్‌లను కూడా జత చేసే అవకాశం ఉంది. ఇవాళ ఉదయం 8 గంటల తర్వాత నుంచి ఈ రైళ్లకు సంబంధించిన ఆన్‌లైన్ బుకింగ్ IRCTC వెబ్‌సైట్‌లో ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. భక్తులు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకోవాలని, చివరి నిమిషంలో రద్దీ కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవొచ్చని అధికారులు సూచించారు.
ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా శబరిమల యాత్రకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని అంచనా. అయ్యప్పమాల ధరించిన భక్తులు ఇప్పటికే ప్రయాణ ఏర్పాట్లు ప్రారంభించారు. ప్రత్యేక రైళ్ల నిర్ణయం వల్ల రోడ్డు మార్గాలపై ఒత్తిడి తగ్గుతుందని, భక్తులు సురక్షితంగా, సౌకర్యవంతంగా తమ గమ్యస్థానాలకు చేరుకోగలరని రైల్వే అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. భక్తులకు సమయపాలన, పరిశుభ్రత, సౌకర్యాలు, భద్రతపైన దృష్టి సారించినట్లు SCR అధికారులు పేర్కొన్నారు. మొత్తం మీద ఈ నిర్ణయం భక్తులకు ఆశీర్వాదమేనని చెప్పవచ్చు.