📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Bhu Bharathi : భూభారతితో ‘ధరణి’ సమస్యల పరిష్కారం

Author Icon By Sudheer
Updated: July 21, 2025 • 10:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత ప్రభుత్వ పదేండ్ల పాలనలో ప్రజలు భూసంబంధిత సమస్యలతో సతమతమయిన సంగతి ప్రత్యేకంగా చెప్ప నక్కర్లేదు. ముఖ్యంగా ధరణి పోర్టల్ బాధితుల అవస్థలు. అయితే వర్ణనాతీతమే. రకరకాల సమస్యలతో జనం ఇక్క జట్లు పడ్డారు. ఇప్పటికీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ధరణి స్థానంలోభూభారతి చట్టం “తీసుకొచ్చింది. సుమారు 9వేల పైచిలుకు భూభారతి సద ఇస్సులు నిర్వహించి జనం నుంచి సుమారు 3 లక్షలా 30 వేలకు పై చిలుకు దరఖాస్తులను స్వీకరించింది. అయితే, వీటి పరిష్కారానికి ప్రజాప్రభుత్వంలో ఆస్కారం ఉంటుం జదని జనం ఎంతో ఆశగా, అత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కారు ఎంతో జాగ్రత్తగా ఆచితూచి భూసంబంధిత సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలి.

ఇక్కడే అసలు చిక్కులు

రెవెన్యూ శాఖ మంత్రి ఆగస్టు 15 లోపు భూసమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించారు. దాంతో రెవెన్యూ శాఖ వాళ్లకు పంద్రాగస్టు అనేది డెడ్లైన్గా మారింది. ఇక్కడే అసలు చిక్కులు వచ్చి పడ్డట్టయింది. ఆగస్టు 15 లోపు అప్లికేషన్లను ఏ మేరకు పరిష్కరిస్తారనేది కీలకం కానుంది. భూసంబంధిత సమస్యల పరిష్కారానికి రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది కీలకంగా పని చేయాలి. కాగా, క్షేత్రస్థాయిలో యంత్రాంగం కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ప్రజల సమస్యలను ప్రభుత్వం నిజంగా పరిష్కరించా లనుకుంటే రెవెన్యూ శాఖలో గ్రామాల్లో కీలకంగా వ్యవహ రించాల్సిన గ్రామ పాలనా అధికారులను (వీఏవో) వెంటనే అధిక సంఖ్యలో నియమించాలి. తద్వారా గ్రామాల్లో రెవిన్యూ????న్యూ చిక్కులకు చెక్ పడే ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా డెడ్లైన్ విధించి పనులు చేయాలని ఆదేశాలు జారీ చేస్తే మళ్లీ సేమ్ తప్పులు రిపీట్ అయ్యే చాన్సెస్ మెండుగా ఉంటాయి. ఈ విషయాలను గమనించి సర్కారు ఆ దిశగా ఆలోచన చేయాలి. గతంలో గ్రామస్థాయిలో కీలకంగా వ్యవహరించే వీఆర్వోలు ఉండేవారు, కానీ, వారిని తీసేశారు.

లైసెన్సుడ్ సర్వేయర్ల కొరత

ఇప్పుడు సరికొత్త పేరు(వీఏవో)తో మరొక పోస్టు ను క్రియేట్ చేస్తున్నారు. ఇకపోతే రాష్ట్రంలోని కొన్ని మండ లాల్లో అయితే తహశీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఆయా చోట్ల సమస్యల పరిష్కా రానికి సిబ్బంది అవసరముంటుంది. లైసెన్సుడ్ సర్వేయర్ల కొరత కూడా ఉంది. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సర్కారు పకడ్బందీ చర్యలు తీసుకుంటేనే భూ సంబంధిత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. లేదంటే గతంలో ధరణి బాధితుల మాదిరిగానే భవిష్యత్తులో భూ భారతి బాధితులు ఉండే ఆస్కారముంటుంది. అలాకాకుండా ఉండాలంటే ప్రభుత్వం మానవ వనరులను రెవెన్యూ శాఖ లో పెంచేందుకు తగు చర్యలు తీసుకోవాలి.

Read Also : Sarfaraz Khan : 17 కిలోల బరువు తగ్గిన సర్ఫరాజ్ ఖాన్

bhu bharathi Dharani Solving the problems

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.