హిల్‌స్టేట్ హిమాచల్ ప్రదేశ్‌లో మంచు చిరుతల సంఖ్య పెరిగింది. ఎత్తైన గిరిజన ప్రాంతాల్లో అరుదైన మంచు చిరుతల (Snow Leopards) జనాభా గత నాలుగేండ్లలో 62 శాతం పెరిగినట్లు రాష్ట్ర అటవీ శాఖ తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 83 మంచు చిరుతలు (Snow Leopards) ఉన్నట్లు తాజా సర్వేలో తేలింది. 2021లో ఆ సంఖ్య (]Number of) 51గా ఉన్నట్లు పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్ అటవీ శాఖకు చెందిన వైల్డ్ లైఫ్ వింగ్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా రాష్ట్రంలో మంచు చిరుతలు నివసించే 26,000 కి.మీ విస్తీర్ణంలోని ఆరు ప్రదేశాలను కవర్ చేశారు. కొండలు, బండరాళ్లు, పొలాలు, ఎత్తైన ప్రదేశాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి మంచు చిరుతలను లెక్కించారు. ఏడాది కాలంగా నిర్వహించిన ఈ సర్వేలో 83 మంచు చిరుతలు కెమెరాలకు చిక్కాయి. లాహౌల్-స్పితి, కిన్నౌర్, పాంగి లోయలోని గిరిజన ప్రాంతాల్లో మంచు చిరుతలు, వాటి ఆవాసాలను గుర్తించారు.
ఇక ఈ సర్వే విజయవంతం కావడానికి స్థానికుల భాగస్వామ్యం చాలా కీలకమని అధికారులు తెలిపారు. స్పితిలోని కిబ్బర్ గ్రామానికి చెందిన స్థానిక యువకులు, మహిళలు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు, డేటా విశ్లేషణకు సాయం చేసినట్లు చెప్పారు. ఫ్రంట్‌లైన్ అటవీ అధికారులు, తదితరులు క్షేత్రస్థాయిలో నిర్వహించిన కార్యకలాపాలకు మద్దతు ఇచ్చినట్లు వెల్లడించారు. వారి సాయంతో ఈ సర్వేని ఏడాదిలోనే పూర్తి చేసినట్లు వివరించారు. కాగా, గతేడాది ‘వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII)’ నిర్వహించిన శాస్త్రీయ గణనలో దేశంలో మొత్తం 718 మంచు చిరుతలు ఉన్నట్లు తేలిన విషయం తెలిసిందే. దేశంలో మంచు చిరుతలు (Snow Leopards) నివసించే 1.20 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో (లఢఖ్, జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ ) 70 శాతానికి పైగా ప్రదేశాన్ని ఈ శాస్త్రీయ గణన కవర్ చేసిందని కేంద్రం తెలిపింది. 2019 నుంచి 2023 వరకు నాలుగేళ్లపాటు మంచు చిరుతల శాస్త్రీయ గణన జరిగింది. మొత్తం 1971 ప్రాంతాల్లో 1.80 లక్షల ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి మంచు చిరుతలను లెక్కించారు. అందులో అత్యధికంగా లఢఖ్‌లో 447 చిరుతలు ఉన్నట్లు తేలింది. అదేవిధంగా ఉత్తరాఖండ్‌లో 124, హిమాచల్‌ప్రదేశ్‌లో 51, అరుణాచల్‌ప్రదేశ్‌లో 36, సిక్కింలో 21, జమ్ము కశ్మీర్‌లో 9 మంచు చిరుతలు ఉన్నాయి.
మంచు చిరుత గురించి 10 వాస్తవాలు?
మంచు చిరుతలు సాధారణంగా 3,000-4,500 మీటర్ల ఎత్తులో ఉన్న ఎత్తైన పర్వత ప్రాంతాలలో నివసిస్తాయి. అవి కొండలు, రాతి గుట్టలు మరియు లోయలు వంటి నిటారుగా, విరిగిన ప్రకృతి దృశ్యాలను ఇష్టపడతాయి. మంచు చిరుతలు చిన్న ముందరి కాళ్ళు మరియు పొడవైన వెనుక కాళ్ళను కలిగి ఉంటాయి, ఇవి వాటి నిటారుగా మరియు కఠినమైన వాతావరణాలలో ప్రయాణించడానికి మరియు చురుగ్గా ఉండటానికి వీలు కల్పిస్తాయి.
మంచు చిరుత మానవులకు భయపడుతుందా?
మంచు చిరుతలు మనుషుల పట్ల దూకుడుగా ఉండవు. మానవుడిపై మంచు చిరుత దాడి జరిగినట్లు ఇప్పటివరకు నిర్ధారించబడలేదు. ఆహారం తినే సమయంలో చెదిరిపోయినా, మంచు చిరుత ఆ ప్రదేశాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నించడం కంటే పారిపోయే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: