Delhi: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం (ఈరోజు) ఘెర విషాదం చోటుచేసుకుంది. ముస్తాఫాబాద్ ప్రాంతంలో ఆరంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: ఢిల్లీ లో ‘దేవి’ ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభానికి సిద్ధం!