📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Shravan Rao : నాలుగవసారి సిట్ ఎదుట విచారణకు హాజరు

Author Icon By Digital
Updated: April 17, 2025 • 12:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న ప్రముఖ మీడియా అధినేత Shravan Rao మరోసారి సిట్ అధికారులు విచారించారు. ఇది నాలుగవసారి ఆయన విచారణకు హాజరవడం. బుధవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లోని సిట్ కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన విచారణ ఐదున్నర గంటల పాటు సాగింది. ఇప్పటికే మూడు సార్లు విచారణకు హాజరైన శ్రవణ్ రావు, ఈసారి కూడా తీవ్రంగా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి వచ్చింది.ఈ కేసు మొదట గత ఏడాది (2024) మార్చిలో వెలుగు చూసింది. నాటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు మొదటి నిందితుడిగా గుర్తించబడ్డారు. ఆరో నిందితుడిగా ఉన్న ,Shravan Rao కేసు వెలుగు చూడకముందే 2024 ఫిబ్రవరిలో అమెరికాకు పారిపోయారు. మిగతా నలుగురు పోలీసు అధికారులు అరెస్టయ్యి పది నెలల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ మధ్యనే సిట్ అధికారులు ఈ ఇద్దరిని భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయగా, ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరో నిందితుడు శ్రవణ్ రావు

ఇంతలో ప్రభాకర్ రావు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరగా, శ్రవణ్ రావు సుప్రీం కోర్టులో మధ్యంతర ఉత్తర్వులు పొంది గత నెల 29వ తేదీన మొదటిసారి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మొదటి దఫా విచారణ ఆరున్నర గంటల పాటు సాగింది. ఈ విచారణలో ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎక్కడ కొనుగోలు చేశారో, ఎవరి ఆధ్వర్యంలో ఇది జరిగినదో, ఎంత డబ్బు ఖర్చయిందో వంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి వచ్చింది.రెండవసారి విచారణ మే 2న జరిగినప్పటికీ అది కేవలం గంటపాటే సాగింది. ఈసారి 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వాడిన ఫోన్లను తేవాలని సిట్ కోరగా, శ్రవణ్ రావు రెండు ఫోన్లు సమర్పించారు. వాటిలో సమాచారమేమీ లేకపోవడంతో అసలైన ఫోన్లు తెచ్చి ఇవ్వాలని సూచించగా, ఆయన అందజేశారు. ఆ ఫోన్లలోని డేటాను విశ్లేషించిన అనంతరం మూడవసారి, అంటే మే 8న శ్రవణ్ రావును 11 గంటల పాటు విచారించారు.తాజాగా బుధవారం మరోసారి ఐదున్నర గంటలపాటు విచారణ జరిపారు. ఈ దఫా సిట్ బాస్ పశ్చిమ మండల డీసీపీ విజయ్ కుమార్, ఎసీపీ వెంకటగిరి తదితర అధికారులు విచారణలో పాల్గొన్నారు. ఇందులో ముఖ్యంగా 2023 ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిందన్న అంశంపై దృష్టి పెట్టారు. ఎన్ని నెలలు ట్యాపింగ్ కొనసాగింది, ఎన్ని కేంద్రాల్లో ఈ కార్యకలాపాలు జరిగినాయి, ఎన్ని మొబైల్ ట్యాపింగ్ కేంద్రాలు వాడారు, ఇందులో పాల్గొన్న వారిలో ఎవరెవరు పోలీసు అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో కూడా ప్రశ్నించినట్టు సమాచారం.ఇటీవల అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల సహకారం ఉందా అనే కోణంలోనూ ప్రశ్నలు చేశారు. శ్రవణ్ రావు ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం మరోసారి అవసరమైతే హాజరు కావాలని సూచించడంతో, రాత్రి పది గంటల సమయంలో ఆయన పోలీసు స్టేషన్ నుంచి బయటకు వచ్చారు. అయితే, మీడియాతో ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా అక్కడి నుండి నిశ్శబ్దంగా వెళ్లిపోయారు

Read more : JD Vance : యూఎస్ ఉపాధ్యక్షుడి భారత పర్యటన ఖరారు

Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News PhoneTappingCase PoliticalNews ShravanRao TelanganaNews Telugu News Telugu News online Telugu News Paper Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.