మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ (Peddi) నుండి వస్తున్న తాజా అప్‌డేట్ మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ చిత్రం నుండి రెండో సింగిల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. మార్చి 2వ తేదీన ‘రాయ్ రాయ్ రా రా’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఒక పవర్‌ఫుల్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన మొదటి పాట ‘చికిరి చికిరి’ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించి, మ్యూజిక్ లవర్స్ ప్లేలిస్ట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉండటంతో, రెండో పాట కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Greenfield highway : తెలుగు రాష్ట్రాల మధ్య తొలి గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రారంభం
బుచ్చిబాబు సానా మార్క్ ఎమోషనల్ అండ్ మాస్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ కథలో రామ్ చరణ్ సరికొత్త గెటప్‌లో కనిపించనున్నారు. ‘రాయ్ రాయ్ రా రా’ అనే పాట మాస్ బీట్‌తో సాగుతుందా లేక సినిమాలోని హీరో క్యారెక్టరైజేషన్‌ను ప్రతిబింబించేలా ఉంటుందా అన్నది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న ఈ చిత్రం, వేసవి కానుకగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ప్రచార చిత్రాలు మరియు పాటల ద్వారా మేకర్స్ సినిమాపై హైప్‌ను తారాస్థాయికి చేరుస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :