📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Sai Prasad-పోలవరం ప్రాజెక్ట్ 2027 డిసెంబర్ నాటికి పూర్తి

Author Icon By Pooja
Updated: September 17, 2025 • 10:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : రాష్ట్రాన్ని కరువురహితంగా మార్చడమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తోందని జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ తెలిపారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో తొలిరోజు జలవనరులపై ఆయన ప్రెజెంటేషన్(Presentation) ఇచ్చారు. ప్రస్తుతం వాతావరణంలో అనూహ్య మార్పులు వస్తున్నాయని, ఎప్పుడు వర్షం వస్తుందో, క్లౌడ్ బరస్ట్ అవుతుందో అంతుపట్టని పరిస్థితి నెలకొన్నదని పేర్కొన్నారు. ఇటువంటి అసమానతల మధ్య నీటి సంరక్షణ పెద్ద సవాలుగా మారిందని ఆయన అన్నారు.

నీటి వనరుల వినియోగం

ఉన్న నీటి వనరులను ఎలా సంరక్షించుకోవాలో కలెక్టర్లు దృష్టి సారించాలని సూచించారు. ఈ ఏడాది రాష్ట్రంలో 88.99 శాతం రిజర్వాయర్లు నిండాయని తెలిపారు. మొత్తం 1,014 టిఎంసిల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లలో 914 టిఎంసిల నీటి లభ్యత ఉందని వివరించారు. చిన్న, మధ్య తరహా రిజర్వాయర్లు కూడా నిండడం మంచి పరిణామమని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం నిధులతో 38,457 మీడియం ఇరిగేషన్ ట్యాంకులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సాయిప్రసాద్ తెలిపారు. ఇప్పటివరకు 5,815 ట్యాంకులు పూర్తి చేశామని చెప్పారు. ఈ పనులపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

భూగర్భజలాల రీఛార్జ్ అవసరం

రాష్ట్రంలోని 7,762 గ్రామాల్లో భూగర్భజలాల(Groundwater) నీటిమట్టం ఎనిమిది మీటర్ల కంటే దిగువన ఉందని ఆయన పేర్కొన్నారు. వాటిని రీఛార్జ్ చేసే పనులు చేపట్టాలని సూచించారు.

పోలవరం ప్రాజెక్ట్‌ను 2027 డిసెంబర్ నాటికల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అయితే వేగవంతంగా పనులు జరపడం ద్వారా జూన్ 2027 నాటికల్లా ప్రాజెక్ట్ పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు.

పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుంది?
డిసెంబర్ 2027 నాటికల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే జూన్ 2027 నాటికల్లా పూర్తి చేయడానికి కృషి చేస్తున్నారు.

రాష్ట్రంలోని రిజర్వాయర్ల నీటి లభ్యత ఎంత ఉంది?
మొత్తం సామర్థ్యం 1,014 టిఎంసిలలో 914 టిఎంసిల నీటి లభ్యత ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/dhanashree-verma-what-does-dhanashree-verma-have-to-say-about-marriage/cinema/548698/

Andhra Pradesh Water Resources AP Irrigation Google News in Telugu Groundwater Recharge Latest News in Telugu Medium Irrigation Tanks Polavaram Project Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.