ప్రభుత్వాన్ని నడపడమంటే పైసలు పంచడం కాదు : కేటీఆర్

Read Time:  1 min
Running a government is not about distributing money. KTR
Running a government is not about distributing money. KTR
FONT SIZE
GET APP

హైదరాబాద్‌: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ 15 నెలల పాలనలో జరిగిన అక్రమాలు, జరగని పనులు గురించి ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు బాహుబలి లాంటి రాష్ట్రాన్ని బలిచేసి.. నంగనాచి మాటలా అంటూ సంచలన ట్వీట్ చేశారు. ఆయన తన ట్వీట్‌లో “ఢిల్లీకి పంపడానికి మూటలు ఉంటాయి కానీ.. హామీల అమలుకు, గారంటీల అమలుకు, ఉద్యోగులకు జీతాలకు, రిటైర్ అయిన వారికి పెన్షన్లకు పైసలు లెవా అని ప్రశ్నించారు. అసమర్థుడి పాలనలో.. ఆర్థిక రంగం అల్లకల్లోలంగా మారిందని.. ప్రభుత్వాన్ని నడపలేని సన్నాసికి ఎందుకంత అహంకారంమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నడపడమంటే పైసలు పంచడం కాదు.. రాష్ట్ర సంపద పెంచడమని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

ప్రభుత్వాన్ని నడపడమంటే పైసలు పంచడం

చివరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేనని

పేమెంట్ కోటాలో పదవి దక్కడం తో కళ్లు నెత్తికెక్కాయని, పదేళ్లు కష్టపడి చక్కదిద్దిన ఆర్థిక రంగాన్ని చిందరవందర చేశావని, తెలంగాణ చరిత్ర క్షమించని ఘోరమైన పాపం మూటగట్టుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. అలాగే ఒకటో నెల ఉద్యోగులకు జీతాలిస్తానని మభ్యపెట్టి.. ఆశా, అంగన్ వాడీలకు ఒక్కో నెల జీతాలు ఆపుతున్నా అని నిస్సిగ్గుగా ప్రకటిస్తారా అని సీఎంను కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజలకు గ్యారెంటీలే కాదు.. చివరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేనని చేతులెత్తేస్తున్న తీరు సీఎం, వారి ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు. ఉద్యోగులు సహకరించడం లేదనడం వారిని దారుణంగా అవమానించడమేనని. ఈ వ్యాఖ్యలు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని కేటీఆర్ అన్నారు. పరిపాలన రాక పెంట కుప్ప చేసి.. ఉద్యోగాలు పనిచేస్తలేరని నిందిస్తే సహించమని ఈ సందర్భంగా సీఎంకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.