ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించిన “సూపర్ సిక్స్” (Super Six) హామీల అమలులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “తల్లికి వందనం” (Thalliki Vandanam) పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఆర్థిక సాయం అందించనుంది. ముఖ్యంగా పిల్లల చదువులో తల్లుల పాత్ర కీలకం అని గుర్తించి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
రూ.15వేలు ప్రతి విద్యార్థికి – 67 లక్షల మందికి లబ్ధి
ఈ పథకం ప్రకారం, తల్లులకు ఒక్కో విద్యార్థికి రూ.15,000 చొప్పున మంజూరు చేయనున్నారు. ఎంత మంది పిల్లలు ఉంటే, అంత మంది పిల్లలకు ఈ నిధులు లభిస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి మొత్తం రూ.8,745 కోట్లు నేరుగా జమ చేయనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. దీనివల్ల విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గనుంది.
రేపటితో కూటమి పాలనకు ఏడాది – తల్లులకు గిఫ్ట్
రేపటితో ఎన్డీయే కూటమి పాలనకు ఏడు నెలలు పూర్తయ్యే సందర్భాన్ని పురస్కరించుకుని ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఇదే సమయంలో “తల్లికి వందనం” పథకం ప్రారంభించటం తల్లులకు ఒక గిఫ్ట్ లా మారనుంది. ఇది తల్లులకు ఆర్థిక భద్రతను కల్పించడమే కాక, విద్యపై మరింత దృష్టి పెట్టేందుకు ప్రోత్సాహకంగా ఉండనుంది. పాఠశాల విద్యను ప్రోత్సహించే ఈ విధానం ప్రజల్లో మంచి ఆదరణ పొందే అవకాశం ఉంది.
Read Also : RCB : నేను రాయల్ ఛాలెంజ్ కూడా తాగను.. ఆర్సీబీలో వాటాలెందుకు? -: డీకే