📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

ఆర్మీ పరేడ్‌లో రోబోటిక్ డాగ్స్‌ మార్చ్​పాస్ట్

Author Icon By sumalatha chinthakayala
Updated: January 15, 2025 • 4:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పుణె: రోబోలు మన సైన్యంలోకి ఎంట్రీ ఇచ్చాయి. నాలుగు పాదాలతో కూడిన Q-UGV రోబోలను మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించిన భారత ఆర్మీ డే పరేడ్‌లో ప్రదర్శించారు. బాంబే ఇంజినీరింగ్ గ్రూప్ (BEG)నకు చెందిన పరేడ్ మైదానం వేదికగా ఈ పరేడ్ జరిగింది. ఇప్పటివరకు AeroArc Pvt Ltd కంపెనీ నుంచి భారత సైన్యం దాదాపు 100కుపైగా రోబోలను కొనుగోలు చేసింది. వీటి పేరు.. ‘ఆర్క్‌వీ మ్యూల్’. ఈ రోబోలను సైనికులు రిమోట్‌‌తో ఆపరేట్ చేయొచ్చు. స్వయం ప్రతిపత్తితోనూ అవి పనిచేయగలవు. ఈ టీమ్‌లోని సైనికులు నాలుగు పాదాలతో కూడిన 8 రోబోలను రిమోట్‌తో ఆపరేట్ చేశారు. మార్చ్‌ ఫాస్ట్‌లో ఈ రోబోలు క్రమశిక్షణతో ముందుకు సాగుతుండగా వాటి వెనుకే సైనికులు నడిచారు. రోబోల నడక శైలి వీక్షకులను ఆకట్టుకుంది. నాలుగు పాదాలతో కూడిన ఈ రోబోలను భారత సైన్యం అత్యాధునిక సాంకేతికతతో తయారు చేయించింది.

రక్షణ రంగ పరిశీలకులు వీటిని సాంకేతికతను సంతరించుకున్న కుక్కలు అని అంటున్నారు. ఈ రోబోలను ఢిల్లీకి చెందిన ఏరోఆర్క్ ప్రైవేట్‌ లిమిటెడ్ (AeroArc Pvt Ltd) కంపెనీ తయారు చేసింది. అందువల్ల వీటికి ‘ఆర్క్‌వీ మ్యూల్’ (ARCV MULE) అని పేరుపెట్టారు. ఇప్పటివరకు ఏరోఆర్క్ కంపెనీ నుంచి భారత సైన్యం దాదాపు 100 రోబోలను కొనుగోలు చేసింది. ఈ రోబోలకు పెట్టిన పేరులోని MULE అనే పదానికి సవివర అర్థం ‘మల్టీ యుటిలిటీ లెగ్డ్‌ ఎక్విప్‌మెంట్’. ఈ రోబోలను రిమోట్‌‌తో ఆపరేట్ చేయవచ్చు. స్వయం ప్రతిపత్తితోనూ ఇవి పనిచేయగలవు. పెరీమీటర్లు, సైనిక పహారా, రసాయన సంబంధిత ప్రమాదాలు, బయోలాజికల్ దాడులు, న్యూక్లియర్ పదార్థాల పేలుళ్లు సంభవించినప్పుడు ఆర్క్‌వీ మ్యూల్ రోబోలను మోహరిస్తారు. బాంబులను నిర్వీర్యం చేసేందుకు సైతం వీటిని వినియోగిస్తారు. ఆర్క్‌వీ మ్యూల్ రోబోలో ప్రధానంగా ఐదు భాగాలు ఉన్నాయి.

ఈ రోబోలోని కంప్యూట్ బాక్స్‌ అనే భాగం రోబోకు మెదడులా సాయం చేస్తుంది. ఈ రోబోలో ఒక బ్యాటరీ ఉంటుంది. దీన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే రోబో 20 గంటలపాటు పనిచేస్తుంది. రోబో తల వెనుక భాగంలో సెన్సార్స్ ఉంటాయి. వీటి సాయంతో పరిసరాల్లో ఏమేం ఉన్నాయనేది రోబో చూస్తుంది. కాళ్ల సాయంతో రోబో నడకను సాగిస్తుంది. సెకనుకు 3 మీటర్ల వేగంతో ఇవి నడవగలవు. ఈ రోబో బరువు 51 కేజీలు ఉంటుంది. చిన్నపాటి తుపాకులు, కెమెరాలు, డ్రోన్లను ఈ రోబోలు మోసుకెళ్లగలవు. గరిష్ఠంగా 12 కేజీల బరువును ఇవి మోయగలవు. ఈ రోబోలు మెట్లు ఎక్కగలవు. కొండ ప్రాంతాల్లో, బురదమయంగా ఉండే ప్రాంతాల్లో నడవగలవు. కనిష్ఠంగా మైనస్ 40 డిగ్రీల శీతల ఉష్ణోగ్రతలోనూ ఈ రోబోలు పనిచేయగలవు. గరిష్ఠంగా 55 డిగ్రీల మండుటెండల్లోనూ ఇవి యాక్టివిటీని చేయగలవు. ఈ రోబోలకు ఐపీ-67 రేటింగ్ లభించింది.

నీళ్లలో మునిగిపోయినప్పటికీ కాసేపటి వరకు ఈ రోబోలు యాక్టివ్‌గానే ఉంటాయి. దుమ్ముధూళి నుంచి రక్షణ ఉండేలా ఈ రోబోల నిర్మాణ స్వరూపం ఉంటుంది. ఈ రోబోలు ఎన్‌విడియా జేవియర్ ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఈ రోబోను 15 నిమిషాల్లోనే వివిధ భాగాలుగా విడగొట్టి తిరిగి జోడించవచ్చు. కాగా 1949 జనవరి 15న ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్పను భారత సైన్యానికి తొలి కమాండర్ ఇన్ చీఫ్‌గా నియమించారు. బ్రిటిషర్ల చివరి కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ఇండియా ఎఫ్ఆర్ఆర్ బుచర్ నుంచి కరియప్ప బాధ్యతలను స్వీకరించారు. ఆ చారిత్రక రోజుకు గుర్తుగా ప్రతి ఏడాది జనవరి 15న ఆర్మీ డే పరేడ్‌ను నిర్వహిస్తున్నారు. చాలా ఏళ్లపాటు దేశ రాజధాని ఢిల్లీలోనే ఈ పరేడ్‌ను నిర్వహించారు. పుణెలో ఈ పరేడ్‌ నిర్వహించడం ఇదే తొలిసారి. 2023లో బెంగళూరులో, 2024లో లక్నోలో ఈ పరేడ్ జరిగింది.

army parade Indian army day maharastra march past Pune Robotic dogs

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.