📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం

CM Revanth : రేవంత్ ను చెట్టుకు కట్టేసి కొట్టాలి – హరీశ్ రావు

Author Icon By Sudheer
Updated: December 25, 2025 • 7:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్రను తక్కువ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు” అని స్పష్టం చేస్తూ, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన యోధుడిని ఒక తండ్రి సమానుడిగా గౌరవించాల్సింది పోయి, ఇష్టానుసారంగా మాట్లాడటం రేవంత్ అవివేకమని హరీష్ విమర్శించారు. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కేసీఆర్ నిలబెట్టారని, అటువంటి నాయకుడిపై విమర్శలు చేయడం అంటే తెలంగాణ ప్రజలను అవమానించడమేనని ఆయన ఆరోపించారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి వీధి రౌడీలా మాట్లాడటం రేవంత్ రెడ్డి సంస్కారానికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Dhurandhar box office : 600 కోట్ల క్లబ్‌లో ధురంధర్.. వంగా రికార్డు బ్రేక్!

రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని తూర్పారబడుతూ హరీష్ రావు పలు సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డికి పార్టీలు మారడం, సీట్లు కొనుగోలు చేయడం, చిల్లర రాజకీయాలు చేయడం అలవాటని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యంగా అధికారంలో ఉంటూ కమీషన్లు దండుకోవడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు. రేవంత్ గతంలో చేసిన పనులను గుర్తు చేస్తూ.. ఆయన మాటల తీరు, ప్రవర్తన ప్రజాస్వామ్యానికి చేటు కలిగిస్తున్నాయని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి భాష కేవలం రాజకీయ పతనాన్ని సూచిస్తుందని, ఆయన నైతికత లేని నాయకుడని హరీష్ రావు ఘాటుగా విమర్శించారు.

Harish Rao fires at Revanth Sarkar

ముఖ్యమంత్రిపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు అత్యంత తీవ్రంగా ఉన్నాయి. “చెట్టుకు కట్టేసి కొరడాతో కొట్టినా తక్కువే” అనే రీతిలో ఆయన చేసిన ప్రసంగం ఉభయ పార్టీల మధ్య పెరిగిన శతృత్వానికి నిదర్శనంగా నిలిచింది. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. కేవలం రాజకీయ ఉనికి కోసమే రేవంత్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, పాలనపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్ష నాయకులను వ్యక్తిగతంగా దూషించడం రేవంత్ బలహీనతకు నిదర్శనమని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మరింత రాజకీయ వేడిని పెంచే సూచనలు కనిపిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

harish rao KCR revanth

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.