📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Breaking News – Reels : డిగ్రీ ఉంటేనే ‘రీల్’ చేయాలి..ప్రభుత్వం కొత్త నిబంధన

Author Icon By Sudheer
Updated: October 28, 2025 • 7:03 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, ఇబ్బంది కలిగించే కంటెంట్ పెరుగుతున్న నేపథ్యంలో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డిగ్రీ ఉన్నవారే రీల్స్, షార్ట్ వీడియోలు రూపొందించే హక్కు పొందనున్నారు. ముఖ్యంగా ఆరోగ్యం, న్యాయశాస్త్రం, విద్య, ఆర్థిక రంగాలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకునే వాళ్లు ఆయా రంగాల్లో పట్టా చేసినవారై ఉండాలని చైనా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది దేశంలో ఉన్న జ్ఞానం, సమాచార నాణ్యతను కాపాడే చర్యగా భావిస్తున్నారు.

Breaking News – Amazon : అమెజాన్లో 30వేల ఉద్యోగుల తొలగింపు..నిజమేనా ?

ఈ కొత్త నిబంధనల ప్రకారం కంటెంట్ క్రియేటర్లు తమ విద్యార్హతలను నిరూపించాల్సి ఉంటుంది. అంతేకాదు, సామాజిక మాధ్యమ సంస్థలు కూడా ఆ వివరాలను పరిశీలించి ఆమోదం ఇచ్చినప్పుడే వీడియోలను అప్లోడ్ చేసే అవకాశం ఉంటుంది. అపోహలు, వైద్య సంబంధిత తప్పుదారి పట్టించే సమాచారంతో ప్రజలకు నష్టం జరుగకుండా అరికట్టడమే ఈ చర్య లక్ష్యం. ముఖ్యంగా కొవిడ్ తర్వాత తప్పుడు ఆరోగ్య సూచనల వల్ల జరిగిన సమస్యలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

నిబంధనలు పాటించకుండా వీడియోలు తయారు చేసే వారు కఠిన శిక్షలకు గురికానున్నారు. వారి ఖాతాలను డిలీట్ చేయడమే కాకుండా రూ.12 లక్షల వరకు జరిమానా విధించనున్నట్లు చైనా అధికారులు హెచ్చరించారు. ఈ నిర్ణయం స్వేచ్ఛాయుత అభిప్రాయ వ్యక్తీకరణపై ప్రభావం చూపుతుందని కొందరు విమర్శిస్తుండగా, బాధ్యతాయుతంగా సమాచార ప్రసారం జరగాలని భావించే వర్గాలు దీనిని స్వాగతిస్తున్నాయి. భవిష్యత్తులో ఇతర దేశాలు కూడా ఈ తరహా చర్యలను పరిశీలించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Chaina govt Google News in Telugu Latest News in Telugu new rule reels

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.