📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News:RDT: మరో పొలికేకతో ఆందోళనకు ప్రజా సంఘాలు సన్నద్ధం

Author Icon By Pooja
Updated: September 29, 2025 • 12:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అనంతపురం : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆర్డిటికి ఎఫ్సీఆర్ఎ లైసెన్సీ ఇప్పించే విషయంలో విఫలమవుతోందని ఆర్దిటి పరిరక్షణ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరో పొలికేక పేరుతో జనాన్ని సమీకరించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు త్వరలో ఆందోళనకు సన్నద్ధమవుతోంది. అందులో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ని కలిసి ఆర్డిటి సమస్యను విన్నవించాలని ఆర్డిటి పరీక్షల కమిటీ నేతలు సన్నాహాల్లో ఉన్నారు. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తగు రీతిలో స్పందించకపోతే దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఆర్డిటి పరిరక్షణ కమిటీ ప్రత్యేకంగా ప్రయత్నాలు చేస్తోంది. ఆర్డిటి పరిరక్షణ కోసం కూటమి పెద్దలు మాట్లాడుతున్న మాటలను ఉమ్మడి అనంతపురం జిల్లా(Anantapur District) ప్రజలు విశ్వసించడం లేదు.

Read Also: Telangana: సౌర విద్యుత్ గ్రామంగా కొండారెడ్డిపల్లి

గత ఆరు నెలలుగా చెప్పిన మాటలే చెబుతున్నారు గాని సమస్య మాత్రం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉన్నది. ఆర్డీటి పరిరక్షణ కమిటీ ప్రకటించిన ఉద్యమ కార్యాచరణకు జిల్లా ప్రజలు, అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాలలో దసరా పండుగను సైతం బహిష్కరించినా పండుగ పట్ల ప్రజలలో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయకుండా, ప్రజలకు ఇబ్బందులు కలిగించకూడదనే సదుద్దేశంతో పండుగ తర్వాతనే ఉద్యమంలోకి(Movement) వెళ్లాలని నిర్ణయించారు. అందులో భాగంగా సోమవారం నిర్వహించ తలపెట్టిన “కేంద్ర కార్యాలయాల ముట్టడి” కార్యక్రమాన్ని వాయిదా వేసింది.

ఆ కార్యక్రమం స్థానంలో సోమవారం జిల్లాకు కొత్తగా వచ్చిన జిల్లా కలెక్టర్ను కలసి అర్డీటీ పరిరక్షణ కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని అందజేయాలని నిర్ణయించారు. అన్ని ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆదివారంనాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆర్డిటి వ్యవస్థాపకులు ఫాదర్ ఫెర్రర్ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుతూ ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి పేదలను అక్కున చేర్చుకున్న ఆర్జిటి వ్యవస్థాపకులు ఫెర్రర్ గారు ఫాదర్ (తండ్రి) అయితే ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగిన ప్రభుత్వ పెద్దలు ఆర్డీటిని నిలుపుకోలేక చతికిలపడి, దోషి (నేరస్తుడు)గా నిలబడ్డారని, దీనిని బట్టి ఎక్కడ పుట్టారు అన్నది ముఖ్యం కాదని, పుట్టిన తరువాత జన్మభూమికి ఏమి చేశారన్నదే ప్రధానం.

అందుకే ఆర్డీటి పరిరక్షణ జరగకపోతే జిల్లా ప్రజలు ఏ త్యాగాలకైనా సిద్ధపడతారని నాయకులు
హెచ్చరించారు. ఆర్డిటిని పరిరక్షణ కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని. పాలక ప్రభుత్వాల దిగివచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిటి పరిరక్షణ కమిటీ కన్వీనర్ సా హరి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవీ రమణ, ఐఎఫ్టియు డి సురేష్, ఐఎంఎం భాష, బహుజన యువసేనా చంద్రాచర్ల హరి, దివ్యాంగుల హక్కుల పోరాట సమితి తరుపున హరినాథ్ రెడ్డి, లక్ష్మీదేవి, బేడ బుడగ జంగం అంజి, ఎంఆర్పిఎస్ చిన ఆంజనేయులు, బడికి రాజు, సామాజిక ఐక్యవేదిక శంకర, కుళ్ళాయప్ప, కళాకారులు ఎర్రిస్వామి, ఈశ్వర్, రామకృష్ణ, సూర్యనారాయణ, సంజీవ. గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

anantapur Andhra Pradesh politics Father Ferrer FCRA license RDT RDT Protection Committee Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.