📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Illegal Soil Excavation : రాజానగరం ఎమ్మెల్యే అనుచరుల అరాచకం

Author Icon By Sudheer
Updated: August 2, 2025 • 10:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాజానగరం (Rajanagaram) నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ కాల్వ పనులు, పుష్కర కాల్వ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రోజు వందల లారీలతో అక్కడ మట్టి(Illegal Soil Excavation)ని స్థానిక జనసేన ఎమ్మెల్యే బత్తుల బల రామక్రష్ణ అనుచరులు తరలించుకుపోతున్నారు. వీరి ఆగడాలు భరించలేని స్థానిక ప్రజలు అర్థరాత్రి…లారీలను అడ్డుకుని, మట్టి మాఫియాపై తిరుగుబాటు చేశారు. ప్రజల్లో చైతన్యం రావడంతో రాత్రికి రాత్రి వార్త వైరల్ అయిపోయింది.

పుష్కరకాల్వ పునాదులనే తవ్వేస్తున్న ఘనులు

ఎంతో ఘనంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చేస్తున్న దందాలు రోజురోజుకి శృతిమించుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో మాట్లాడుతూ కాల్వలు ఆక్రమించినా, నీళ్లు వెళ్లే మార్గాన్ని ఆపినా సహించేది లేదని వార్నింగులు ఇచ్చారు. కానీ సాక్షాత్తూ ఆ పార్టీకి చెందిన రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామ క్రష్ణ సారథ్యంలో ప్రతిష్టాత్మకమైన పోలవరం కాల్వ, పుష్కర కాల్వల మట్టిని అడ్డగోలుగా తరలిస్తుంటే.. ఆయన చేష్టలుడిగి చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

చోద్యం చూస్తున్న అధికారులు

రోజుకి 100 లారీలకు పైనే నాన్ స్టాప్ గా తిరుగుతున్నాయని, అడిగేవాడు, ఆపేవాడే లేడని కలవచర్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతమంది సంబంధిత అధికారులకు విన్నవించినా తేలు కుట్టిన దొంగల్లా అందరూ గమ్మున ఉంటున్నారు కానీ, ఎవరూ పట్టించున్న పాపాన పోలేదని సీరియస్ అవుతున్నారు. రోజూ అధికారుల చుట్టూ తిరగడమే సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఒకరిని అత్యవసరంగా 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తుంటే, ఈ మట్టి లారీల వల్ల…రెండు గంటలు ఆలస్యంగా వెళ్లామని, దీంతో ఒక నిండు ప్రాణం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అర్థరాత్రి అడ్డుకున్న స్థానికులు

పుష్కర కాల్వ కోసం తవ్విన మట్టిని తీస్తే పర్వాలేదు, మొత్తం కాల్వ పునాదులనే తవ్వి తవ్వి లాగేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇలా జరిగితే, గట్లు బలహీనంగా మారతాయని, రేపు కాల్వలకు నీళ్లు వదిలినప్పుడు గండ్లు పడి… ఊళ్లకు ఊళ్లే మునిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రజలందరూ ఏకమై తిరుగుబాటు చేశామని అన్నారు. మొత్తానికి మట్టి మాఫియా చేస్తున్న ఆగడాలపై వార్తలు రావడంతో ఎక్కడి దొంగలక్కడే గప్ చుప్ అన్నట్టు అయిపోయారు.

మరి ఈ ఘటన నేపథ్యంలో రేపు కూటమి నేతలు ఎలా బదులిస్తారో చూస్తామని ప్రజలు అంటున్నారు. అయినా ఆపకపోతే ఆందోళన ఉధ్రతం చేస్తామని హెచ్చరించారు. మంచి ప్రభుత్వమని ఓట్లే సి గెలిపిస్తే, మా మంచిగా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. నెట్టింట్లో కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

Read Also : Cold Storage : కోల్డ్ స్టోరేజ్ లో ఆర్డినెన్స్

Google News in Telugu Illegal excavation Illegal Soil Excavation Polavaram canal soil

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.