ఢిల్లీ వీధుల్లో కుక్కలు (Stray Dogs) కనిపించరాదని సుప్రీంకోర్టు సోమవారం ఢిల్లీ ప్రభుత్వ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. వీధి కుక్కలన్నింటినీ సాధ్యమైనంత త్వరితంగా స్టెరిలైజ్ చేసి షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఢిల్లీ-ఎన్‌సీఆర్ అధికారులను ఆదేశించింది. అయితే, దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం ఆదేశాలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తాజాగా స్పందించారు. మనం రోజు రోజుకూ సైన్స్, మానవత్వం లేని ప్రాచీన యుగంలోకి వెళ్లిపోతున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు. ‘మూగజీవాలైన కుక్కలు సమాజంలో పెద్ద సమస్య కాదు. వాటిని పూర్తిగా నిర్మూలించడం సరైన చర్య కాదు. ప్రజలకు భద్రత కల్పించాలనుకుంటే వాటికి స్టెరిలైజేషన్, టీకాలు వేయడం వంటి చర్యలు తీసుకోవాలి’ అని రాహుల్ గాంధీ (Rahul Gandhi) సూచించారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
వీధి కుక్కల కాటు వల్ల రేబీస్ వ్యాధి వ్యాప్తి చెందుతోందని, ముఖ్యంగా పిల్లలు దీనికి గురవుతుండడంతో పరిస్థితి చాలా దయనీయంగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. వెంటనే వీధి కుక్కల కోసం షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. దాదాపు 5,000 వీధి కుక్కల కోసం 6 నుంచి 8 వారాలలో షెల్టర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. తమ ఆదేశాలకు అవరోధాలు కల్పించడానికి వ్యక్తులు కాని, సంస్థలు కాని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌తో కూడిన ధర్మాసనం హెచ్చరించింది. అవసరమైతే కోర్టు ధిక్కరణ ప్రక్రియ చేపడతామని కూడా ధర్మాసనం హెచ్చరించింది. వీధి కుక్కలను పట్టుకోవడానికి వచ్చే సిబ్బందిని ఎవరైనా అడ్డుకుంటే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది.
రాహుల్ గాంధీ జీవిత చరిత్ర?
రాహుల్ గాంధీ 1970 జూన్ 19న పంజాబ్ ప్రాంతంలో జన్మించారు. రాజీవ్ గాంధీ మరియు సోనియా గాంధీ దంపతుల ఇద్దరు సంతానంలో ఆయన మొదటి సంతానం. ఆయన కుటుంబం భారత రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉండటంతో ప్రసిద్ధి చెందింది. ఆయన తండ్రి తరువాత భారత ప్రధానమంత్రి అయ్యారు.
గాంధీ కుటుంబం ఏ మతం?
మహాత్మా గాంధీ తండ్రి బ్రిటిష్ రాజ్ ఆధిపత్యంలో పనిచేసే స్థానిక ప్రభుత్వ అధికారి, మరియు అతని తల్లి – కుటుంబంలోని మిగిలిన వారిలాగే – హిందూ మతం యొక్క వైష్ణవ సంప్రదాయాన్ని ఆచరించే మత భక్తురాలు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: