📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu news : Raghav Chadha – ‘పంజాబ్‌ డబ్బు పంజాబ్‌ ప్రజలకే’ రాఘవ్ చద్దా

Author Icon By Sudha
Updated: September 3, 2025 • 3:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారీ వర్షాలు, వరదలకు ప్రభావితమైన పంజాబ్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) రూ.3.25 కోట్ల నిధులు (funds) ప్రకటించారు. పంజాబ్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆయన తన ఎంపీలాడ్స్‌ నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ‘ఇది పంజాబ్ డబ్బు. పంజాబ్ ప్రజల కోసం’ అని భావోద్వేగంతో అన్నారు. ఒక వీడియో ద్వారా పంజాబ్‌ ప్రజలకు సంఘీభావం తెలిపారు. ప్రతి ఒక్కరి భద్రత కోసం ప్రార్థించారు. వరదల కారణంగా 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినందుకు సంతాపం తెలిపారు. కాగా, పంజాబ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయం, పునరావాసం కోసం ఈ నిధులు వినియోగిస్తామని రాఘవ్ చద్దా (Raghav Chadha)తెలిపారు. రూ.3.25 కోట్ల సహాయాన్ని పంజాబ్‌లోని రెండు అత్యంత ప్రభావిత జిల్లాలైన గురుదాస్‌పూర్, అమృత్‌సర్‌కు కేటాయించినట్లు చెప్పారు. గురుదాస్‌పూర్ జిల్లాలోని వరద రక్షణ కట్టలను బలోపేతం చేయడానికి, మరమ్మతుల కోసం రూ.2.75 కోట్లు, అమృత్‌సర్ జిల్లాలో సహాయ, పునరావాస పనులకు రూ.50 లక్షలు ఇస్తానని ఆయన తెలిపారు.

Raghav Chadha – ‘పంజాబ్‌ డబ్బు పంజాబ్‌ ప్రజలకే’ రాఘవ్ చద్దా

మరోవైపు చరిత్రలో అత్యంత దారుణమైన వరదలతో పంజాబ్‌ పోరాడుతున్నదని రాఘవ్ చద్దా (Raghav Chadha)తెలిపారు. పంజాబ్‌ వరదల అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతానని చెప్పారు. వరదలతో అతలాకుతలమైన రాష్ట్రానికి మద్దతు కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వరద బాధిత ప్రజలకు సహాయ సహకారాలు అందించిన భారత సైన్యం, బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎన్జీవోలు, పౌర సమాజం, స్థానిక యువత, విపత్తు నిర్వహణ బృందాలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఎంపీ అంటే ఎవరు?

లోక్‌సభలో పార్లమెంటు సభ్యుడు (సంక్షిప్తంగా: MP) అంటే భారత పార్లమెంటు దిగువ సభ అయిన లోక్‌సభలోని శాసనసభ నియోజకవర్గం యొక్క ప్రతినిధి. లోక్‌సభ పార్లమెంటు సభ్యులను వయోజన ఓటు హక్కు ఆధారంగా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు.

రాఘవ్ చద్దా నేపథ్యం ఏమిటి?

ప్రారంభ జీవితం. 1988 నవంబర్ 11న న్యూఢిల్లీలో జన్మించిన చద్దా, మోడరన్ స్కూల్ (న్యూఢిల్లీ) నుండి పాఠశాల విద్యను అభ్యసించి, ఢిల్లీ విశ్వవిద్యాలయం (DU) నుండి పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుండి చార్టర్డ్ అకౌంటెన్సీని అభ్యసించాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/latest-news-warning-tripura-mla-receives-death-threats-from-telangana-governors-son/telangana/540520/#google_vignette

AAP Breaking News latest news Public Welfare Punjab Budget Punjab Politics Raghav Chadha Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.