📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Protest in london-బ్రిటన్లో ముగ్గురు పిల్లల చావుతో రగులుతున్న నిరసన జ్వాలలు

Author Icon By Pooja
Updated: September 15, 2025 • 3:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Protest in london-బ్రిటన్ లో ‘యునైట్ ది కింగ్డమ్’ పేరుతో గతకొన్ని రోజులుగా జరుగుతున్న నిరసనలకు ప్రధాన కారణం, ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక భావమేనని తెలుస్తుంది. బ్రిటిష్ నేషనల్ పార్టీ మాజీ కార్యకర్త, ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక నాయకుడు టామీ రాబిన్సన్(Tommy Robinson) ఈ నిరసనలకు నాయకత్వం మహించారు. ఈ నిరసనలు ఇమ్మిగ్రేషన్ కు వ్యతిరేకంగా జరుగుతున్నాయి.

నిరసనలకు అసలు కారణాలు ఏమిటి?

ఈ నిరసనలకు కొన్నివాకాల క్రితమే. వాయువ్య ఇంగ్లాండ్ లోని సౌత్పోర్ట్లోని ఓ డ్యాన్స్ స్కూల్లో దుండగులు కత్తులతో దాడి చేయడంతో ముగ్గురు పిల్లలు మరణించిన ఘటనతో బ్రిటన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనకు కారకులు వలసదారులేనని అనుమానిసూత, వలస వ్యతిరేక వర్గాలు భారీ ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపట్టాయి. ఈ నిరసనలు కొన్ని చోట్ల హింసాత్మకంగా మారి, దోపిడీలు, విధ్వంసానికి దారితీశాయి. లివర్పూల్, బ్రినటల్, బ్లాక్ పూల్, హల్, మాంచెస్టర్ వంటి అనేక నగరాల్లో ఆందోళనలు, హింస చెలరేగడంతో వందలాది మందిని పోలీసులు అరెస్టు చేశారు. పలు చోట్ల దుకాణాలు, షాపింగ్ మాల్స్ ను లూటీ చేసి, ప్రభుత్వ భవనాలకు నిప్పంటించారు. ఈ పరిస్థితులపై ప్రధాని కీర్ స్టార్మర్ మాట్లాడుతూ, ఈ చర్యలు నిరసనలు కావని, వ్యవస్థీకృత నేరాలని అభివర్ణించారు. హింసకు పాల్పడేవవారు ఎంతటి వారైనా.

కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

నిరసనలకు అంతర్జాతీయ మద్దతు కాగా గతకొన్ని రోజులుగా జరుగుతున్న నిరసనలకు అంతర్జాతీయ మద్దతు లభిస్తుండడం విశేషం. టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్, ఫ్రెంచ్ తీవ్రవాద రాజకీయ నాయకుడు ఎరిక్ జెమ్మౌర్ వంటివారు ఇప్పటికే తమ మద్దతును ప్రకటించారు. మొదట శాంతియుతంగా జరిగిన నిరసనలు కాస్త ఉద్రిక్తతగా మారడంతో పోలీసులు వీరిపై చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. దీంతో నిరసనకారులకు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణలు హింసకు దారితీసింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతోచాలామంది పోలీసులు గాయపడ్డారు.

ఇథియోపియన్ వ్యక్తి లండన్ బాలికపై లైంగిక దాడి చేశాడని అతనికి శిక్ష పడిన తర్వాతే వలసలపై వ్యతిరేకతలు తీవ్రమయ్యాయి. కాగా నిరసనకారులు బ్రిటన్ సాంస్కృతిక(British culture), జాతీయ గుర్తింపును కాపాడాలని పిలుపునిచ్చారు. బ్రిటన్ సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు అక్రమ వలసదారుల వల్ల దెబ్బతింటున్నాయని వారు వాదించారు.

లండన్‌లో నిరసనలు ఎందుకు జరుగుతున్నాయి?
ముగ్గురు చిన్నారుల దుర్మరణం మరియు అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిరసనలు చెలరేగాయి.

నిరసనకారులు ఏం డిమాండ్ చేస్తున్నారు?
బాధ్యులపై కఠిన చర్యలు, చిన్నారుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ktrs-key-instructions-to-brs-party-leaders/telangana/547708/

Britain Protest Children Death Google News in Telugu Latest News in Telugu London Demonstration London Protest UK news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.