📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

AP : 21న ప్రైవేట్ కాలేజీల బంద్ కు పిలుపు

Author Icon By Sudheer
Updated: July 16, 2025 • 8:04 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ డిగ్రీ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ (Private Degree Colleges Management Association) విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరగనుంది. డిగ్రీ విద్యలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్‌తో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అసోసియేషన్ ప్రకటించింది. ప్రభుత్వం నిస్సహకార వైఖరి కొనసాగిస్తోందని, అధికారులు స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమైంది.

మంత్రితో చర్చలు ఫలితం లేకుండా పోయినవని ఆరోపణ

ఈ ఏడాది ఫిబ్రవరిలో అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి లోకేశ్‌(Minister Lokesh)ను కలిసి డిగ్రీ విద్యలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించారని తెలిపారు. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ అమలు కాలేదని అసోసియేషన్ వాపోయింది. ఐదు నెలలు గడిచినా అధికారులు స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. దీనివల్ల కాలేజీల నిర్వహణలో తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయని వారు వెల్లడించారు.

అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభం కానందుపై ఆవేదన

ఇంటర్ ఫలితాలు వెలువడిన రెండు నెలలు గడిచినా ఇప్పటికీ ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ ప్రక్రియ మొదలు కాకపోవడంపై అసోసియేషన్ తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేసింది. విద్యార్థుల భవిష్యత్‌కు ఇది ప్రమాదకరమని, ప్రభుత్వం తక్షణమే చొరవ చూపి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే తదుపరి చర్యల్ని ప్రకటించాల్సి వస్తుందని హెచ్చరించారు.

Read ALso : Raviteja Father Dies : రవితేజ తండ్రి కన్నుమూత

Ap Private colleges bandh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.