IPL news : ‘మీ అబ్బాయి వచ్చేశాడు’.. షా ఎమోషనల్ రియాక్షన్

Read Time:  1 min
IPL news
IPL news
FONT SIZE
GET APP

IPL news : భారత యువ ఓపెనర్ పృథ్వీ షా మళ్లీ తన ఐపీఎల్ ప్రస్థానం ప్రారంభమైన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి చేరాడు. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందుగా అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న శిక్షణా శిబిరంలో అతడు పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన పునరాగమనంపై భావోద్వేగంగా స్పందిస్తూ, ఈ మైదానంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.

Read Also:Dhurandhar 2 Collections: 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల గ్రాస్ వసూళ్లు

IPL news
IPL news

గతంలో జట్టునుంచి విడుదలై, వేలంలో కొనుగోలు కాలేకపోయిన షా చివరికి మళ్లీ ఢిల్లీ జట్టే అతడిని కనీస ధరకు తీసుకుంది. “కొన్ని కథలు ముగియవు.. తిరిగి వస్తాయి. ఢిల్లీ.. మీ అబ్బాయి ఇంటికి వచ్చేశాడు” అని అతడు చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ సీజన్‌లో మంచి ప్రదర్శన చేసి తనను తాను నిరూపించుకోవాలనే లక్ష్యంతో షా సిద్ధమవుతున్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.