📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Modi : విశాఖ యోగా వేడుకలకు ప్రధాని మోదీ

Author Icon By Sudheer
Updated: May 14, 2025 • 10:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విశాఖపట్నం మరోసారి జాతీయ స్థాయి దృష్టిని ఆకర్షించనుంది. వచ్చే నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) సందర్భంగా విశాఖలో మేగాయోగా ఈవెంట్‌ నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానుండటంతో విశాఖ వేదికగా దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ‘యోగాంధ్ర-2025’ నినాదంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది.

దాదాపు 2 లక్షల మంది ప్రజలతో ఈ యోగా వేడుక

ఈ కార్యక్రమాన్ని సమీక్షించేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (CS) కేఎస్ విజయానంద్ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. దాదాపు 2 లక్షల మంది ప్రజలతో ఈ యోగా వేడుకను గ్రాండ్‌గా నిర్వహించాలనే లక్ష్యంతో కార్యాచరణ రూపొందిస్తున్నారు. విశాఖ నగరాన్ని శుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దే పనులు కూడా ప్రారంభమయ్యాయి.

ఈ ఈవెంట్ ద్వారా విశాఖ పేరు మరింత ప్రాచుర్యంలోకి

ఈ యోగా వేడుకకు ఆయుష్ మంత్రిత్వశాఖతో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈశా ఫౌండేషన్, యోగా స్పోర్ట్స్ అసోసియేషన్‌లు తమ మద్దతు తెలియజేశాయి. దేశవ్యాప్తంగా యోగా మీద ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో, ఈ ఈవెంట్ ద్వారా విశాఖ పేరు మరింత ప్రాచుర్యంలోకి రానుంది. ఆరోగ్య పరిరక్షణలో యోగాసనాల పాత్రను ప్రాచుర్యం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

Read Also : Permission : సులభతరంగా అనుమతుల ప్రక్రియ – సీఎం రేవంత్

ap tour Google News in Telugu international yoga day june 221 modi yogaday

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.