భారత దేశంలో కార్ల రంగంలో అగ్రగామిగా ఉన్న మారుతి సుజు(Maruti Suzuki)కి, కార్ల కొనుగోలుదారులకు మరోసారి బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఒకసారి ధరలు పెంచిన మారుతి, తాజాగా మరోసారి పెంపును అమలు చేసింది. ముఖ్యంగా ప్రాచుర్యం పొందిన మోడల్స్ ఎర్టిగా మరియు బాలెనో కార్లపై ఈసారి ప్రభావం చూపింది. తాజా పెంపుతో ఎర్టిగా ధర 1.4 శాతం పెరగగా, బాలెనోపై 0.5 శాతం పెరిగింది.
ఎయిర్‌బ్యాగ్ స్టాండర్డ్ ఫీచర్ కారణంగా ధరల పెంపు
ఈ ధరల పెంపుకు కారణంగా మారుతి సంస్థ వెల్లడించిన విషయం ప్రత్యేకంగా గమనించాల్సిందే. భద్రతా ప్రమాణాలను మరింతగా మెరుగుపరిచే క్రమంలో తమ కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ ఫీచర్‌గా అందించడమే ధరల పెంపుకు దారితీసిందని సంస్థ స్పష్టం చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వ భద్రతా మార్గదర్శకాల ప్రకారమేనని, వినియోగదారుల ప్రయాణ భద్రత తమకు ముఖ్యమని కంపెనీ పేర్కొంది.
నూతన ధరలు అమల్లోకి వచ్చాయి
ఇప్పటికే ఈ ధరలు అమల్లోకి వచ్చినట్టు మారుతి ప్రకటించింది. దీంతో బాలెనో ప్రీమియం హ్యాచ్బ్యాక్ కార్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.6.7 లక్షల నుంచి ప్రారంభం అవుతుండగా, ఎర్టిగా ధర రూ.8.97 లక్షల నుంచి మొదలవుతుంది. ఇటీవలే మారుతి ఇతర మోడళ్లపై కూడా కొంత మేరకు ధరలు పెంచిన సంగతి తెలిసిందే. ఈ తాజా పెంపుతో మిడిల్ క్లాస్ వినియోగదారులకు కొంతమేర భారం పెరిగినట్టేనని భావిస్తున్నారు.
Read Also :Parliament Sessions : కేంద్రాన్ని ఇరుకునపెట్టేలా కాంగ్రెస్ వ్యూహం!