ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, అల్లు అర్జున్ నానమ్మ కనకరత్నం (Kanakaratnam) పెద్దకర్మ కార్యక్రమంలో మెగా కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రముఖ హీరోలు ఒకే ఫ్రేములో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒకే ఫొటోలో కలిసి దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా హాజరయ్యారు. ఈ అరుదైన ఫొటోలను గీతా ఆర్ట్స్ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేయడంతో అవి తక్కువ సమయంలోనే వైరల్‌గా మారాయి.
కనకరత్నం గారికి నివాళులు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెగా హీరోలు అల్లు కనకరత్నం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అల్లు అరవింద్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా గీతా ఆర్ట్స్ షేర్ చేసిన పోస్ట్‌లో “కనకరత్నం గారి ఆశీస్సులు తమపై ఎల్లప్పుడూ ఉంటాయని” పేర్కొంది. ఈ ఫొటోలో మెగా హీరోలంతా (Mega Heros ) సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఈ సంఘటన మెగా అభిమానులందరికీ ఒక మంచి అనుభూతిని ఇచ్చింది.
అభిమానుల్లో ఆనందం
తమ అభిమాన హీరోలు ముగ్గురు ఒకే ఫొటోలో కనిపించడంతో అభిమానులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. గతంలో అప్పుడప్పుడు ఏదో ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి కనిపించినప్పటికీ, ఈసారి ఒకే ఫ్రేములో ముగ్గురు కలిసి ఉండటం వారికి ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చింది. ఈ ఫొటోల ద్వారా మెగా కుటుంబంలో ఉన్న ఐక్యత మరోసారి వెల్లడైందని అభిమానులు పేర్కొంటున్నారు.