హైదరాబాద్ : జనవరి 1 నుంచి ప్రారంభం కానున్న(Ponnam Prabhakar) నుమాయిష్ – 2026 ప్రారంభోత్సవానికి రావాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు ఆహ్వానించారు. జనవరి 1 నుండి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ఎగ్జిబిషన్ (నుమాయిష్) ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్ని ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు ఆదివారం ఆహ్వానించారు.
Read also: TG: యాదగిరిగుట్ట వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ సేవలు రద్దు
85వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన ఏర్పాట్లు
జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నుమాయిష్- 2026 ఎగ్జిబిషన్ (Numaish) మైదానంలో ఏర్పాటు చేయనున్న నుమాయిష్-2026 (85వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన) జనవరి 1 నుంచి ఫిబ్రవరి జరగనున్నాయి. నుమాయిష్ ను జనవరి 1న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రారంభించనున్నారు. (Ponnam Prabhakar) ఎగ్జిబిషన్లో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు స్టాళ్లు ఏర్పాటు చేయనున్నాయి. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు, శని, ఆదివారాల్లో రాత్రి 11 గంటల వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. ప్రవేశ రుసుమును రూ.50 ఉండగా ఐదేళ్లలోపు పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: