📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Bengaluru Stampede : కోహ్లిపై పోలీసులకు ఫిర్యాదు

Author Icon By Sudheer
Updated: June 6, 2025 • 11:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట (Bengaluru Stampede) ఘటన దర్యాప్తు దశలో మరింత మలుపు తిరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి RCB స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిపై కూడా పోలీసులకు ఫిర్యాదు అందింది. సంఘటనకు విరాట్ కోహ్లి (Kohli) కారణమని ఆరోపిస్తూ “రియల్ ఫైటర్స్ ఫోరం” అధ్యక్షుడు వెంకటేశ్ కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్‌కి ఫిర్యాదు చేశారు. అభిమానుల ర్యాలీకి ఉత్సాహాన్నిచ్చిన కోహ్లి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

కోహ్లిపై కేసు నమోదు చేయాలా వద్దా అనే అంశంపై చర్చ

ఇప్పటికే ఈ తొక్కిసలాట ఘటనపై ఆర్గనైజర్లు మరియు సంబంధిత అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా, ఇప్పుడు కోహ్లిపై కేసు నమోదు చేయాలా వద్దా అనే అంశంపై చర్చ జరుగుతోంది. పోలీసు వర్గాలు దీనిపై న్యాయ సలహా తీసుకుంటున్నట్లు సమాచారం. కోహ్లి ర్యాలీని ప్రోత్సహించడం వల్లే భారీగా అభిమానులు అక్కడికి చేరారని, దీనివల్ల అపహత్తి, గందరగోళం ఏర్పడిందని ఫిర్యాదులో పేర్కొనడం విశేషం.

కోహ్లిపై కేసు నమోదు..?

కాగా, కోహ్లిపై కేసు నమోదు చేయడం సాధ్యమా కాదా అనే దానిపై నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం సోషల్ మీడియా పోస్టులు లేదా అభిమానుల ఆహ్వానం వలన లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చాయా? లేక ఆయనే ప్రత్యక్షంగా ఏదైనా బాధ్యత తప్పించుకున్నారా? అనే కోణాల్లో అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లిపై కేసు నమోదు చేసే విషయంలో తుది నిర్ణయం త్వరలో తీసుకోనున్నారు.

Read Also : Narendra Modi : కెనడా ప్రధాని మార్క్ కార్నీ నుంచి మోదీకి ఫోన్ కాల్

Bengaluru Stampede kohli kohli case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.