📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి

Crashed Plane : కుప్పకూలిన విమానం.. వాహనాలు దగ్ధం

Author Icon By Sudheer
Updated: October 13, 2025 • 6:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా రాష్ట్రం టెక్సాస్‌లో ఘోర విమాన ప్రమాదం (Crashed Plane) చోటుచేసుకుంది. ఫోర్ట్ వర్త్ ప్రాంతంలోని హైవే సమీపంలో ఓ చిన్న మినీ విమానం కుప్పకూలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విమానం కూలిన ప్రదేశంలో భారీ అగ్నికీలలు ఎగసిపడటంతో చుట్టుపక్కల ప్రాంతం భయాందోళనకు గురైంది. ప్రమాదం చోటుచేసుకున్న వెంటనే అక్కడి ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. విమానం రోడ్డుపై ఉన్న ట్రక్కులను ఢీకొట్టడంతో మంటలు మరింత వ్యాపించాయి. క్షణాల్లోనే పలు సెమీ ట్రక్కులు పూర్తిగా మంటల్లో చిక్కి బూడిదైపోయాయి. సన్నివేశం చూసిన ప్రత్యక్ష సాక్షులు ఆ క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీడియోలు వైరల్ అయ్యాయి.

Latest News: Bapatla Sea Accident: బాపట్లలో సముద్రంలో విషాదం

ఫైర్ సిబ్బంది సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. భారీగా పొగలు ఎగసిపడటంతో సుమారు గంటసేపు ఆపరేషన్ కొనసాగింది. విమానం కూలిన ప్రాంతం వాణిజ్య రహదారి కావడంతో పలు వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. ప్రమాద సమయంలో రోడ్డు మీద ఉన్న డ్రైవర్లు తాము ప్రాణాలు నిలుపుకోవడానికి పరుగులు తీశారని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారు? ఎవరైనా ప్రాణాలు కోల్పోయారా? అనే విషయాలు ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉందని స్థానిక మీడియా పేర్కొంది. రక్షణ బృందాలు శకలాల మధ్య శోధన కొనసాగిస్తున్నాయి.

ప్రాథమిక సమాచార ప్రకారం, ఇంజిన్ లోపం కారణంగా విమానం కూలిపోయి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) మరియు నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బోర్డ్ (NTSB) సంయుక్తంగా ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించాయి. టెక్సాస్ రాష్ట్రంలో ఇంత భారీ స్థాయిలో విమాన ప్రమాదం సంభవించడం స్థానికులను కలవరపరిచింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయడంతో పాటు రవాణా తాత్కాలికంగా నిలిపివేశారు. అధికారులు త్వరలోనే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, మరణాలు లేదా గాయాల వివరాలను వెల్లడించనున్నట్లు సమాచారం.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Crashed Plane Fatal plane Google News in Telugu Saginaw Boulevard in Tarrant County

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.