📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం

Author Icon By sumalatha chinthakayala
Updated: December 25, 2024 • 1:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అజర్‌బైజాన్: కజకిస్తాన్‌లో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కజకిస్తాన్‌లోని అక్టౌ నగరానికి సమీపంలో కూలిపోయింది. విమానం క్రాష్ కావడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదం సమయంలో విమానంలో 110 మంది వరకు ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారని సమాచారం.

అజర్‌బైజాన్ రాజధాని బాకు నుంచి రష్యాలోని గ్ర్జోనీకి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం దారి మళ్లించారు. కానీ అంతలోనే అక్టౌ సిటీ సమీపంలో విమానం క్రాష్ అవడంతో ఘోర విషాదం చోటుచేసుకుంది. అందులో ప్రయాణిస్తున్న పలువురు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఆ దేశ అత్యవసర మంత్రిత్వ శాఖ విమానం క్రాష్ అయినట్లు నిర్ధారించినట్లు రాయిటర్స్ నివేదించింది. విమానంలో ప్రయాణిస్తున్న వారిలో భారీ సంఖ్యలో మరణాలు సంభవించి ఉంటాయని ప్రాథమికంగా తెలుస్తోంది.

కాగా, గ్రోజ్నీలో దట్టమైన పొగమంచు కారణంగా విమానాన్ని అత్యవసరంగా కజకిస్థాన్లోని అక్టౌ విమానాశ్రయంలో దించేందుకు పైలట్‌ ప్రయత్నించారు. అందుకోసం ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ అనుమతి కూడా కోరారు. ఇంతలో విమానం ఆక్టౌ విమానాశ్రయం పైకి వచ్చి చక్కెర్లు కొడుతూ కుప్పకూలింది. ప్రమాదం జరగగానే కజకిస్థాన్‌కు చెందిన రెస్క్యూ టీమ్స్‌ ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. రెస్క్యూ సిబ్బంది విమానం నుంచి ఆరుగురు ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. మిగతావారి పరిస్థితి ఎలా ఉందనే విషయం తెలియాల్సి ఉంది.

azerbaijan airlines Kazakhstan Kazakhstan Plane Crash plane crashed

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.