📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

ఎమ్మెల్సీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం !

Author Icon By sumalatha chinthakayala
Updated: February 14, 2025 • 3:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతి: ఏపీలో ఎమ్మెల్సీకలకు సమయం దగ్గర పడుతోంది.. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఎన్నికల బరిలో నిలిచేది ఎవరూ అనేది తేలిపోయింది. ఇక, ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. 3వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే కూటమి పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. సీఎం చంద్రబాబు మంత్రులకు.. నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ తరుణంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించారు. ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సి ఎన్నికల్లో కూటమి అభ్యర్ధుల విజయానికి జనసేన తరపున పార్లమెంట్ నియోజక వర్గాలవారీగా సమన్వయకర్తలను నియమించారు ఆ పార్టీ- అధినేత పవన్ కల్యాణ్. ఆయా పార్లమెంట్ నియోజక వర్గాల పరిధిలో కూటమి నేతలతో సమన్వయం చేసుకొంటూ, నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం అభ్యర్థుల విజయానికి ముందుకు వెళ్లాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

పార్లమెంట్ నియోజకవర్గాలు- జనసేన సమన్వయకర్తలు వీరే..

కాకినాడ-తుమ్మల రామస్వామి, రాజమండ్రి-వై.శ్రీనివాసరావు, అమలాపురం- బండారు శ్రీనివాసరావు, నరసాపురం-చన్నమల్ల చంద్రశేఖర్, ఏలూరు-రెడ్డి అప్పల నాయుడు, విజయవాడ-అమ్మిశెట్టి వాసు, మచిలీపట్నం- బండి రామకృష్ణ, గుంటూరు- నయబ్ కమల్, నరసరావు పేట-వడ్రాణం మార్కండేయ బాబు.

Breaking News in Telugu Google news Google News in Telugu MLC elections Pawan Kalyan Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.