దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్‌లో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఈ క్రమంలో యాదాద్రి జిల్లాలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చాలా మంది సొంత వాహనాలలో బయల్దేరడంతో కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు రైళ్లు, బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
సొంతూళ్లకు పయనం.. భారీగా ట్రాఫిక్ జామ్
By
Sudheer
Updated: October 11, 2024 • 3:33 AM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.