పహల్గామ్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) ప్రాంతంలో ఉన్న ఉగ్రవాద మూకల స్థావరాలపై దాడులు జరిపింది. ఈ చర్యల నేపథ్యంలో పాకిస్థాన్ లోపల తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
కేంద్ర హోంశాఖ హైఅలర్ట్: టార్గెట్ ప్రాంతాలుగా మూడు కేటగిరీలు
ఈ నేపథ్యంలో ఢిల్లీలో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దాడులు జరిగే ప్రమాదం ఉన్న ప్రాంతాలను మూడు కేటగిరీలుగా విభజించారు. భారత్- పాక్ వార్ ప్రకంపనల నేపథ్యంలో ఢిల్లీ వేదికగా కేంద్ర హోంశాఖ హైలెవల్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను 3 కేటగిరీలుగా విభజించారు. మెట్రో, డిఫెన్స్, పోర్ట్స్, ఎనర్జీ హబ్స్ వారీగా డివిజన్ చేశారు. ఈ లెక్కన కేటగిరి-1లో దేశ రాజధాని ఢిల్లీ, మహారాష్ట్రలోని తారాపూర్ న్యూక్లియర్ ప్లాంట్‌ను చేర్చారు. ఢిల్లీలో దాదాపు అన్ని విభాగాల ప్రధాన కార్యాలయాలు ఉండడంతో అదే పాకిస్తాన్‌కు మెయిన్ టార్గెట్‌గా భావించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, సూరత్, వడోదరతో పాటు అణు విద్యుత్ కేంద్రాలు ఉన్న పలు నగరాలు కేటగిరి-1లో ఉన్నాయి.
హైదరాబాద్, విశాఖపట్నం టార్గెట్ ఎందుకు?
తెలుగు రాష్ట్రాలకు చెందిన హైదరాబాద్, వైజాగ్‌లు కేటగిరి-2లో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ యుద్ధమే ప్రారంభమైతే పాకిస్తాన్ ప్రధానంగా టార్గెట్ చేసే ప్రాంతాల్లో హైదరాబాద్, విశాఖ ఉండడంతో ఆయా ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అలెర్ట్ అవుతోంది. హైదరాబాద్‌లో రక్షణ పరిశోధన రంగాలకు చెందిన DRDO, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబొరేటరీ, అడ్వాన్స్‌డ్ హైపర్‌సోనిక్ విండ్ టన్నెల్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఎయిర్ ఫోర్స్ అకాడమీ లాంటి అనేక రక్షణ రంగానికి చెందిన సంస్థలు ఉన్నాయి. ఇవి అగ్ని, పృథ్వీ, ఆకాశ్, బ్రహ్మోస్ వంటి క్షిపణుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేటగిరీ-2 హిట్‌లిస్ట్‌లో హైదరాబాద్ ఒకటిగా చేరింది. కేటగిరీ-2 హిట్‌లిస్టులో విశాఖపట్నం కూడా ఉండడం హాట్‌టాపిక్‌గా మారుతోంది. విశాఖలోనూ భారత రక్షణ రంగానికి చెందిన సంస్థలు ఉండడంతో కీలకంగా స్థానాన్ని సంపాదించింది. ప్రధానంగా విశాఖ తూర్పు నౌకా కమాండ్‌కు ప్రధాన కేంద్రంగా ఉంది. ఇది ఇండియన్ నేవీలో అతి ముఖ్యమైన కమాండ్‌లలో ఒకటిగా ఉంది. కేటగిరీ-3 పోర్ట్ టౌన్లు, ఎనర్జీ హబ్‌లుగా ఉన్న ప్రాంతాలు — మున్‌రా, కాంద్లా, పారాడీప్, జామ్‌నగర్ వంటి ప్రదేశాలు. DRDO ఆధ్వర్యంలో యుద్ధ నౌకలు, విమానాలు, హెలికాప్టర్ల కోసం ప్రత్యేక పరికరాల తయారీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న ప్రణాళికలు కూడా ఉన్నాయి. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ పరిస్థితులు వచ్చినట్లయితే, దేశవ్యాప్తంగా — ముఖ్యంగా రక్షణ రంగంలో కీలక ప్రాధాన్యత కలిగిన నగరాలు అత్యంత నిగూఢమైన లక్ష్యాలుగా మారనున్నాయి. హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాలు టార్గెట్‌గా మారుతున్నట్లు భద్రతా శాఖలు భావిస్తున్నాయి.
Read also: Operation Sindoor : భారత్ ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్‌లో 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది