Operation Mahadev: ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా పహల్గాం ఘటన జరిగింది. 26మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులు పాకిస్థాన్ కు చెందిన వారని భారత్ ఎంత నెత్తినోరు కొట్టుకుని చెబుతున్నా దాన్ని అంగీకరించని పాక్ కుంటిసాకులను చెబుతూ వస్తున్నది. ఈ చర్యకు ప్రతిచర్యగా భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) పేరుతో యుద్ధానికి దిగింది. అక్కడి పలువురి ఉగ్రవాదులను హతమార్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ ఉగ్రవాదులు తమ దేశానికి చెందినవారేనని పాక్ దొరికిపోయింది. పహల్గాం దాడి జరిగిన 98 రోజుల తర్వాత ఇండియన్ ఆర్మీ (Indian Army) ఒక ఉగ్రవాదిని హతమార్చింది. పాకిస్థాన్ పత్రిక రాసిన ఓ ఆర్టికల్ ద్వారా పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడింది పాకిస్థాన్ వాళ్లే అని తెలుస్తోంది. ఉగ్రదాడికి పాల్పడిన వారి గురించి ఫొటోలతో సహా అన్నీ ఆధారాలు ఇండియన్ ఆర్మీ దగ్గర ఉన్నాయి.
భారత్ పై పాకిస్థాన్ ఆగ్రహం వ్యక్తం
ఆపరేషన్ మహాదేవ్ లో ముగ్గురు ఉగ్రవాదులను చంపడంపై పాకిస్థాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత ఏజెన్సీలు ఎన్ కౌంటర్లలో నిర్బంధించిన పాకిస్తానీలను చంపుతున్నారని చెప్పుకొచ్చింది. అలాగే వారిని సీమాంతర ఉగ్రవాదులు అని పిలుస్తున్నాయని పాకిస్థాన్ పేర్కొంది. పాకిస్థాన్ ప్రభుత్వ సంస్థలు ఈ ఉగ్రవాదులను అమాయకులు, పాకిస్తానీలు అని పిలుస్తున్నాయి. కాశ్మీర్ అడవుల్లో ఓ పాకిస్థాన్ పౌరుడు శాటిలైట్ ఫోన్, ఆయుధాలతో ఏం చేస్తున్నాడో అని దాని గురించి డాన్ పత్రికలో రాయలేదు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఓ ఎం4 కార్బైన్ రైఫిల్, 2ఎకే రైఫిల్స్, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అవి నకిలీ ఎన్ కౌంటటర్లు అంటూ పాక్ పిచ్చిరాతలు ప్రపంచవ్యాప్తంగా భారత్ కు లభిస్తున్న మద్దతు, పాకిస్థాన్ కు ఎదురవుతున్న వ్యతిరేకతలతో సతమతమవుతున్న పాకిస్తాన్ తాజాగా నకిలీ వార్తలను ప్రచురిస్తున్నాయి. ఆంగ్ల వార్తాపత్రిక డాన్లో ఇలా రాసింది. ఆపరేషన్ మహాదేవ్ (Operation Mahadev) పేరుతో ఇండియాలో నకిలీ ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయని పాకిస్థాన్ భద్రతా అన్నట్లు పేర్కొంది. భారతదేశంలో 56మంది పాకిస్తానీయులను అదుపులోకి తీసుకున్నట్లు పాకిస్థాన్ పేర్కొంది. వారు అమాయకులు అని పాకిస్థాన్ ఉగ్రవాదులపై తమ సానుభూతిని వ్యక్తం చేస్తున్నది. పహల్గాం దాడి సూత్రధారి హషీం మూసా పాకిస్థాన్ సైన్యంలో పని చేసిన వ్యక్తి అని రాసుకొచ్చింది. ఉగ్రవాదిని ఎలైట్ యూనిట్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ మాజీ కమాండో అని చెప్పడం గమనార్హం. ఉగ్రవాదులకు ఆదినుంచి ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్థాన్ తీరుపట్లు ప్రపంచదేశాలు, ఐక్యరాజ్యసమితి
వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. అయినా నిత్యం అసత్యవాదనలకు దిగుతున పాకిస్తాన్.
ఆపరేషన్ సిందూర్ అంటే ఏమిటి?
26 మంది అమాయక పౌరుల ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత, మే 7, 2025న ప్రారంభించబడిన ఆపరేషన్ సిందూర్, ఖచ్చితత్వం, వృత్తి నైపుణ్యం మరియు ఉద్దేశ్యాన్ని కలిగి ఉన్న క్రమాంకనం చేయబడిన, త్రివిధ దళాల ప్రతిస్పందనను ప్రదర్శించింది.
ఆపరేషన్ సిందూర్ కారణం ఏమిటి?
“ఆపరేషన్ సిందూర్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం పాకిస్తాన్ గడ్డపై పనిచేస్తున్న ఉగ్రవాద కర్మాగారాలను నాశనం చేయడం మరియు నిర్మూలించడం . ఉగ్రవాద స్థావరాలు మరియు నర్సరీలను కూల్చివేసే లక్ష్యం సాధించబడినందున దానిని విరమించుకున్నారు” అని ఆయన సభకు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: New York : మాన్‌హట్టన్ లో మాస్ షూటింగ్ – నలుగురు మృతి