📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మరోసారి రామ్ గోపాల్ వర్మకు నోటీసులు..

Author Icon By sumalatha chinthakayala
Updated: January 29, 2025 • 10:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 4న విచారణకి హాజరు కావాలని ఒంగోలు పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు రూరల్ సీఐ శ్రీకాంత్ రామ్ గోపాల్ వర్మ వాట్సప్‌కి నోటీసు పంపారు. విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు పంపినా పలు కారణాలు చెప్తూ విచారణకు వెళ్లకుండా ఉన్నారు వర్మ. ఆ విషయంలో ఒంగోలు పోలీసులు సీరియస్‌గా ఉన్నారు.

వర్మ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. నవంబర్ 10న వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. నవంబర్ 19, 25 తేదీల్లో రెండు సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకి హాజరు కాకుండా కొద్ది రోజులు వర్మ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇక, చాలాకాలాంగా ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. ఇంతకు ముందు కూడా ఈ కేసు విషయంపై ఒంగోలు పోలీసులు ఆర్జీవీకి నోటీసులు అందించారు.

కానీ అప్పుడు ఆయన విచారణకు హాజరు కాలేదు. హాజరు కాలేననే విషయాన్ని లాయర్ ద్వారా చెప్పించారు. ఇప్పుడు మరోసారి ఇదే విషయంపై పోలీసులు వర్మకు నోటీసులు పంపించారు. ఫిబ్రవరీ 4న తప్పకుండా విచారణకు హాజరు కావాల్సిందే అని తెలిపారు. ఇప్పటివరు ఈ కేసు విషయంలో ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు వర్మ. అందుకే ఆయనపై పోలీసులు సీరియస్‌గా ఉన్నారు. మరి ఈసారి నోటీసులకు అయినా ఆయన సీరియస్‌గా స్పందించి విచారణకు హాజరు అవుతారేమో చూడాలి.

Notices ongole police Ram Gopal Varma

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.