ప్రతి నెలా కొన్ని ప్రాముఖ్యమైన రూల్స్ మారుతూనే ఉంటాయి. ముఖ్యంగా LPG సిలిండర్ ధరలు ప్రతి నెల మార్చబడతాయి. అక్టోబర్ 1 నుండి ఆన్‌లైన్ గేమింగ్, రైల్వే టిక్కెట్లు, వడ్డీ రేట్లు, UPI, పెన్షన్ ప్లాన్‌లలో కొన్ని కీలక మార్పులు అమలు అవుతున్నాయి.
ఆన్‌లైన్ గేమింగ్:
ప్రభుత్వం మోసాలు రాకుండా ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుని(Online gaming bill) అక్టోబర్ 1 నుండి అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం, ఆన్‌లైన్‌లో డబ్బు పెట్టి ఆడే గేమ్స్ అన్ని బ్యాన్ అవుతాయి.
రైల్వే టిక్కెట్లు:
అక్టోబర్ 1 నుండి రైల్వే టికెట్ బుకింగ్, రద్దు రూల్స్‌లో మార్పులు చేయబడ్డాయి. ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేసినవారే ఫస్ట్ రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ 15 నిమిషాల్లో బుకింగ్ చేయాలంటే ఆధార్ పూర్తి ఉండాలి.
Read Also: AP Rain Alert: ఉత్తర కోస్తాలో భారీ వర్షాల సూచన
వడ్డీ రేట్లు, పెట్టుబడులు:
ఫిక్సడ్ డిపాజిట్, రుణాలు, పొదుపు పథకాల వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయి. పెట్టుబడిదారులు ఈ మార్పులను తెలుసుకొని తమ పెట్టుబడులను సర్దుకోవాలి.
UPI పేమెంట్స్:
అక్టోబర్ 1 నుంచి పియర్-టు-పియర్ UPI ట్రాన్సాక్షన్స్ బ్యాన్(Transactions Ban) అవుతాయి. వినియోగదారులు ఇకపై స్కాన్ లేదా నెంబర్ ద్వారా మాత్రమే పేమెంట్ చేయగలరు.
LPG ధరలు:
ప్రతి నెల ఒకటో తారీఖున LPG సిలిండర్ ధరల్లో మార్పు జరుగుతుంది. చమురు కంపెనీలు ధరలను మినహాయింపులు లేకుండా సవరించుకుంటాయి.
పెన్షన్ ప్లాన్‌లు:
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) చందాదారులు వీరి పెన్షన్ మొత్తంలో 100% వరకు ఈక్విటీలలో పెట్టుబడులు చేయవచ్చు. ప్రభుత్వేతర చందాదారులు కూడా తమ పెన్షన్ మొత్తాన్ని ఈక్విటీ మార్కెట్స్‌లో పెట్టవచ్చు.
అక్టోబర్ 1 నుంచి LPG ధరల్లో మార్పు ఎప్పుడూ వస్తుందా?
ప్రతి నెల ఒకటో తేదీ నుంచి LPG ధరలు సవరించబడతాయి.
ఆన్‌లైన్ గేమింగ్ పై కొత్త నియమం ఏమిటి?
అక్టోబర్ 1 నుంచి డబ్బు పెట్టి ఆడే ఆన్‌లైన్ గేమ్స్ అన్ని బ్యాన్ అవుతాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: