📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

Hyderabad Metro : మరోసారి మెట్రో రైలు ఎండీగా ఎన్వీఎస్ రెడ్డికే బాధ్యతలు

Author Icon By sumalatha chinthakayala
Updated: April 9, 2025 • 1:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Hyderabad Metro: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే వివిధ శాఖల్లో రీ-అపాయింట్మెంట్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానాల్లో కొనసాగుతున్న ఉద్యోగులను ఉద్వాసన పలికిన ప్రభుత్వం.. మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన నిర్ణయాన్ని వెల్లడించింది. హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (HMRL), హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML) ఎండీగా ఎన్వీఎస్ రెడ్డిని మళ్లీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఎం. దానకిశోర్ నుంచి అధికారిక ఉత్తర్వులు

ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం. దానకిశోర్ నుంచి అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రెండో దశకు సంబంధించిన ప్రాజెక్టు ప్రతిపాదనలు కీలక దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రారంభం నుంచే మెట్రో ప్రాజెక్టుకు నడిపిన ఎన్వీఎస్ రెడ్డి అనుభవం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఆయనను మరో ఏడాది పాటు హెచ్ఎంఆర్ఎల్, హెచ్ఏఎంఎల్ ఎండీగా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుంది.

ఈ ప్రాజెక్టు మొత్తం రెండు భాగాలుగా

ప్రస్తుతం మెట్రో సెకండ్ ఫేజ్ ప్రాజెక్టు భాగంగా ఓల్డ్ సిటీ, ఎయిర్‌పోర్ట్, ఫోర్త్ సిటీ, నార్త్ సిటీ లాంటి ప్రాంతాలకు మెట్రో సేవలు విస్తరించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. ఈ ప్రాజెక్టు మొత్తం రెండు భాగాలుగా – పార్ట్-ఏ(5 కారిడార్లు), పార్ట్-బీ(3 కారిడార్లు)గా విభజించగా, పార్ట్-ఏకి చెందిన డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్రానికి పంపారు. కేంద్ర అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. అనుమతి లభించిన వెంటనే పనులను వేగంగా ప్రారంభించాలనే ఉద్దేశంతోనే ఎన్వీఎస్ రెడ్డి సేవలు కొనసాగించనున్నారు. ఇక ఇటీవలే ప్రభుత్వం మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలో 177 మంది, పంచాయతీ రాజ్ శాఖలో 47 మందిని తొలగించింది.

Read Also : నటుడు మంచు మనోజ్‌ కారు చోరీ..పోలీసులకు ఫిర్యాదు

Breaking News in Telugu Google news Google News in Telugu Hyderabad Metro Latest News in Telugu NVS Reddy Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.