తెలంగాణలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంలో IAS అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన సోషల్ మీడియా పోస్టు చర్చనీయాంశమైంది. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ, సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని, చట్ట ప్రకారం ముందుకెళ్తామని స్పష్టం చేశారు.
కంచ భూములపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు
మంత్రి మాట్లాడుతూ.. కంచ భూములపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తప్పుడు సమాచారం ఆధారంగా వచ్చాయని అన్నారు. బీజేపీ నేతల ప్రొవైడెడ్ మిసింఫోర్మషన్ వల్లే ఈ వ్యాఖ్యలు జరిగాయని మండిపడ్డారు. అసలు విషయాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు మోసపోవద్దని హెచ్చరించారు. అధికారిణి చేసిన పోస్టుపై ప్రభుత్వం చట్టబద్ధంగా స్పందిస్తుందన్నారు.
బీజేపీ మరియు BRS కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఫై కుట్ర
ఇదిలా ఉండగా, బీజేపీ మరియు BRS కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని కుట్ర పన్నుతున్నాయని శ్రీధర్ బాబు ఆరోపించారు. తాము ప్రజల మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వం కావడంతో, అలాంటి కుట్రలు ప్రభావితం చేయవని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సత్యం ఏదైనా బయటపెడతామని అన్నారు.