—- 1,565 అడ్మిషన్లు పొందిన విద్యార్థులు
New Primary Schools: హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాలనీల్లో ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేయాలన్న ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 41 కొత్త ప్రాథమిక పాఠశాలలను (New primary schools) ఏర్పాటు చేశారు. 41 ప్రాథమిక పాఠశాలల్లో 1565 మంది విద్యార్థులు చేరినట్టు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను (Double bedroom houses) మంజూరు చేసిన నేపథ్యంలో పలు కాలనీలు కొత్తగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన కాలనీల్లో ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో జిల్లా విద్యాధికారులు రాష్ట్రంలో అదనంగా 571 పాఠశాలలను ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నట్టు వివరాలను పంపించారు. అనంతరం క్షేత్రస్థాయిలో పరిశీలించిన పాఠశాల విద్యశాఖ అధికారులు రాష్ట్రంలో 157 స్కూల్స్ ను ఏర్పాటు చేయవచ్చని సూచించారు. వెంటనే ప్రారంభించాలని పాఠశాల విద్య డైరక్టర్ కార్యాలయం నుంచి డీఈవోలను ఆదేశించడంతో.. కొత్తగా ఏర్పడిన కాలనీల్లో ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించారు. 41 పాఠశాలలను ప్రారంభించగా ఇప్పటి వరకు 1,565 మంది విద్యార్థులు చేరినట్టు అధికారులు చెబుతున్నారు.
కొత్తగా ఏర్పడిన కాలనీల్లో ఎందుకు ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేశారు?
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కారణంగా ఏర్పడిన కొత్త కాలనీల్లో విద్యా అవసరాల కోసం పాఠశాలలను ఏర్పాటు చేశారు.
ఇప్పటివరకు ఎన్ని కొత్త ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించబడ్డాయి?
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 41 కొత్త ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించబడ్డాయి.
Read Hindi News : hindi.vaartha.com
Read also: Engineering College: ఇంజినీరింగ్ కాలేజీల ప్రిన్సిపాళ్లతో ఫీజుల నిర్ధారణ అధికారుల కమిటీ భేటీ