📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

బడ్జెట్‌ సమావేశాల్లో కొత్త ఆదాయం పన్ను బిల్లు

Author Icon By sumalatha chinthakayala
Updated: January 18, 2025 • 5:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: జనవరి 31 నుండి పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే వచ్చే బడ్జెట్‌ పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. ‘కొత్త ఆదాయం పన్ను బిల్లును ప్రతిపాదించనున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఆదాయం పన్ను చట్టాన్ని సరళతరం చేసి కొత్త చట్టం తీసుకొస్తారు. ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేసే పేజీల సంఖ్యను సుమారు 60శాతం తగ్గించి, సమగ్ర ఆదాయం పన్ను చట్టం రూపొందిస్తారు. ప్రస్తుతం ముసాయిదా బిల్లు కేంద్ర న్యాయశాఖ పరిశీలనలో ఉంది. మలి విడత బడ్జెట్‌ పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశ పెడతారని తెలుస్తున్నది.

2024 జూలైలో 2024-25 ఆర్థిక సంవత్సర పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. ఆరు నెలల్లో పాత ఆదాయం పన్ను చట్టం-1961పై సమగ్రంగా సమీక్షిస్తామని ప్రకటించారు. ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్‌ పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశ పెడతారు. కొత్త ఆదాయం పన్ను చట్టం రూపొందిస్తారు తప్ప ప్రస్తుత చట్టానికి సవరణలు కాదని అధికార వర్గాలు తెలిపాయి.

image

బడ్జెట్‌ పార్లమెంట్‌ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్‌ నాలుగో తేదీ వరకూ జరుగుతాయి. ఈ నెల 31న పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించడంతో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు మొదలవుతాయి. తొలుత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకూ కొనసాగుతాయి. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2025-26 సంవత్సరానికి బడ్జెట్‌ సమర్పిస్తారు. మార్చి 10 నుంచి ఏప్రిల్‌ నాలుగో తేదీ వరకూ మలి విడుత బడ్జెట్‌ సమావేశాలు జరుగుతాయి. ఈ బిల్లును పార్లమెంట్‌ ఉభయ సభలు ఆమోదిస్తే చట్టంగా మారుతుంది.

పాత కాలం నాటి ఆదాయం పన్ను చట్టం -1961పై సమీక్షించి సమగ్ర నివేదిక తయారు చేయడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఒక అంతర్గత కమిటీ నియమించింది. సంక్షిప్తంగా, స్పష్టంగా తేలిగ్గా అర్ధం చేసుకునే విధంగా ప్రతిపాదిత బిల్లు ఉంటుంది. వివాదాలు, వ్యాజ్యాలు తగ్గించడానికి పరిష్కార మార్గాలు ప్రతిపాదిస్తారు. పాత ఆదాయం పన్ను చట్టంలోని వివిధ అంశాలను సమీక్షించేందుకు 22 స్పెషలైజ్డ్‌ సబ్‌ కమిటీలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే చట్టం సమీక్షించడానికి ప్రజల నుంచి 6500 సూచనలు వచ్చాయి. ప్రస్తుతం చట్టం 298 సెక్షన్లు, 23 చాప్టర్లు కలిగి ఉంది. ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన ఆదాయం పన్ను చట్టం-1961లో వ్యక్తిగత ఆదాయం పన్ను, కార్పొరేట్‌ పన్ను, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్‌ టాక్స్‌, గిఫ్ట్‌ టాక్స్‌, వెల్త్‌ టాక్స్‌ వస్తాయి.

Budget 2026 Budget Sessions Google news New Income Tax Bill Nirmala Sitaraman

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.