📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Nawaz Sharif : భారత్‌తో దూకుడు వద్దు – పాక్‌ ప్రధానికి సూచన!

Author Icon By Shobha Rani
Updated: May 10, 2025 • 12:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్​-పాక్​ల (Bharat-pak) మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్​ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్( Nawaz Sharif),​ ప్రస్తుత ప్రధాని షెహబాజ్​ షరీఫ్​ (Nawaz Sharif) కు కీలక సూచనలు చేశారు. భారత్​తో దూకుడు వ్యవహరించవద్దని, దౌత్యమార్గాల్లో సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని సూచించారు. అంతేకాదు భారతదేశంతో సంప్రదింపులు జరిపేందుకు వ్యక్తిగతంగా నవాబ్​ షరీఫ్​ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
సైనికాధికారులతో కూడిన కీలక చర్చలు
భారత్‌-పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరమవుతున్న వేళ పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ 2 రోజుల క్రితం కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సైనిక ఉన్నతాధికారులు సహా అధికార పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌-నవాజ్‌ (PML-N) పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కూడా హాజరయ్యారు. ప్రభుత్వంలో ఎటువంటి పదవీ లేకున్నా, కేవలం అధికార ఆ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నవాజ్‌ మాట్లాడుతూ, ‘భారత్‌తో దూకుడుగా వ్యవహరించవద్దని, ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్యపరంగా ప్రయత్నాలు చేయాలి’ అని తన సోదరుడు, పాక్​ పీఎం అయిన షెహబాజ్‌ షరీఫ్‌ (Nawaz Sharif) కు సూచించినట్లు తెలిసింది. అంతకాదు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు చేసేందుకు లండన్‌ నుంచి నవాజ్ షరీఫ్​ (Nawaz Sharif) వచ్చారని, ఇందుకోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, 1999లో కార్గిల్‌ యుద్ధం జరిగిన సమయంలో నవాజ్‌ షరీఫ్‌ (Nawaz Sharif) పాక్ ప్రధానమంత్రిగా ఉన్నారు.

Nawaz Sharif : భారత్‌తో దూకుడు వద్దు – పాక్‌ ప్రధానికి సూచన!

భారత్ వైఖరితో ఉద్రిక్తతలు పెరిగాయి: షెహబాజ్ ఆరోపణ
పహల్గాం దాడి అనంతరం నవాజ్ షరీఫ్‌(Nawaz Sharif) తోపాక్​ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్​ భేటీ అయ్యారు. భారత్‌ చర్యలకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయనకు వివరించారు. భారత్​ తీరు వల్లే ఉద్రిక్తతలు పెరిగాయని ఆయన ఆరోపించారు. నవాజ్‌ మాత్రం, దూకుడుగా వ్యవహరించకుండా, భారత్‌తో శాంతి పునరుద్ధరణ కోసం అందుబాటులో ఉన్న అన్ని దౌత్య మార్గాలను వినియోగించుకోవాలని ప్రధానికి సూచించినట్లు తెలుస్తోంది.
పాక్ ఫైటర్ జెట్లు, డ్రోన్లు ధ్వంసం చేసిన భారత్
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా, భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి, పాకిస్థాన్​లోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసింది. దీనితో ఉక్కిరిబిక్కిరి అయిన పాకిస్థాన్​, పరువు నిలబెట్టుకోవడం కోసం భారత్​పై హమాస్​ ఉగ్రవాదుల తరహాలో దాడులకు పాల్పడుతోంది. దీనితో దీటుగా స్పందించిన భారత్, పాకిస్థాన్​కు చెందిన ఫైటర్ జెట్లను, డ్రోన్​లను, క్షిపణ రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసింది. దీనితో ఇరుదేశాల మధ్య మరింతగా ఉద్రిక్తలు పెరిగాయి.

Read Also: Operation Sindoor: జమ్మూలోని ఆలయంపై పాక్ మిస్సైల్ దాడి.. తిప్పికొట్టిన భారత సైన్యం

advice to Pakistan Prime Minister! Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Nawaz Sharif : No aggression with India - Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.