📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Qatar-ఇజ్రాయెల్ దాడిపై మండిపడ్డ ముస్లిం దేశాలు

Author Icon By Pooja
Updated: September 16, 2025 • 11:13 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఖతార్ లోని హమాస్ నాయకులనే లక్ష్యంగా ఇజ్రాయెల్ చేసిన దాడిపై ముస్లిం దేశాలన్ని ముక్తకంఠంతో ఖండించాయి. అంతేకాక ఇజ్రాయెల్ ను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని అరబ్, ముస్లిం దేశాలు తీర్మానించాయి. ఖతార్ లోని హమాస్ లీడర్లే లక్ష్యంగా ఐడీఎఫ్(IDF) చేసి దాడిపై ఇస్లాం దేశాలు మండిపడుతున్నాయి. దీనిపై నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని అన్ని దేశాలూ తీర్మానించాయి. ఇజ్రాయెల్ రక్తదాహాన్ని అడ్డుకుందామంటూ అరబ్, ముస్లి దేశాలకు ఖతార్ అధినేత షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థాని పిలుపునిచ్చారు. అంతేకాక అత్యవసర సమావేశంగా అరబ్-ముస్లిం దేశాలు కూడి ఆ విషయంపై చర్చించాయి. ఇందులో మలేసియా, ఇండోనేసియా, ఈజిప్టు, ఇరాన్, ఇరాక్, కువైట్, తుర్కియే, సౌదీ అరేబియా దేశాలతో సహా 50కి పైగా దేశాల అధినేతలు, మంత్రులు ఇందులో పాల్గొన్నారు. రోజురోజుకు మితిమీరుతున్న ఇజ్రాయెల్ దేశం చేష్టలకు అడ్డుకట్ట వేయాల్సిన సమయం వచ్చిందని దేశాధినేతలు అభిప్రాయపడ్డారు.

అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్న ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలను(International laws) ఉల్లంఘిస్తోంది. దీనికి తోడు ప్రాంతీయ శాంతికి దౌత్యపరమైన ప్రయత్నాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తోందని ఇస్లాం దేశాలు ఆరోపిస్తున్నాయి. జెరూసలెం రాజధానిగా 1967 సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా దేశానికి మరోసారి మద్దతును పునరుద్ఘాటించాయి. గాజాపై ఇజ్రాయెల్ ఏడాదిన్నరగా దాడులను కొనసాగిస్తూనే ఉందని, ఈ దాడులను ఆపేందుకు మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతార్, ఈజిప్టు, అమెరికాలకు మద్దతుగా నిలిచాయి. భవిష్యత్తులో తమలో ఏ ఒక దేశమైనా దాడి జరిగినా.. అందరిపై దాడి జరిగినట్లుగా భావిస్తామని తీర్మానించాయి. యుద్ధాల వల్ల ఇప్పటికే ఎంతో నష్టం వాటిల్లిందని, ఎంతోమంది సైనికులు మరణించారని, అమాయక ప్రజలపై దాడులు చేస్తూ, వారి మరణానికి కారణమైన ఇజ్రాయెల్ చర్యలను ఇక ఏమాత్రం సహించబోమని పేర్కొన్నాయి.

ఇజ్రాయెల్ దాడిపై ముస్లిం దేశాలు ఏ విధంగా స్పందించాయి?
ముస్లిం దేశాలు ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి మరియు ఖతార్ కూడా ఇజ్రాయెల్ చర్యలను విమర్శించింది.

ఖతార్ ఏ విషయంపై ప్రధానంగా మండిపడింది?
పౌరులపై దాడులు జరగడం, నిరపరాధుల ప్రాణాలు కోల్పోవడం పై ఖతార్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/andhra-pradesh-amaravati-cable-bridge-with-rs-2500-crore/breaking-news/548052/

Gaza Conflict Google News in Telugu israel attack Latest News in Telugu Middle East crisis Muslim Nations Qatar Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.